సూర్యాపేట : అక్కడి గుట్టు దేవుడికి ఎరుక
సూర్యాపేట : అక్కడి గుట్టు దేవుడికి ఎరుక
సూర్యాపేట, మనసాక్షి
అసలు సూర్యాపేట అయ్యప్పస్వామి దేవాలయం లో ఏమి జరుగుతుంది…దేవుడి పేరు తో దందా చేస్తున్నారా…? అంత ఆముగ్గేరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా…? ఎన్నింఏండ్లు అతనే పెత్తనం చెలయుస్తాడు..?.
64 మంది సభ్యులు ఉన్న దేవాలయం కమిటీలో ఇతర సామాజిక వర్గానికి అధ్యక్ష కార్యదర్శి పదవులు దక్కవా..? గతంలో ఎవరికి తెల్వకుండా 7 గురికి ఇచ్చిన సభ్యత్వం డబ్బులకు రసీదు లు ఏవి ,…? ఎప్పుడో కట్టిన గదులకు ఇప్పుడు దాతల పేర్లు పెట్టుకోవడమేంది…?.గదుల నిర్మాణ నికి దాతలు ఇచ్చిన డబ్బులకు లెక్క పాత్రలు ఉన్నాయా…? కోశాధికారి గా ఉన్న వ్యక్తి నిర్వహించాల్సిన బాధ్యతలను కూడా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తే చేస్తున్నట్ల సమాచారం.
ఆయనే ఎందుకు అలా చేస్తున్నారు..అని ఇలా పలు పలు విధాలుగా పలువురి మదిలో మెదులుతున్న ప్రశ్నలు అవి .దేవాలయం లో జరుగుతున్న అవకతవకలు పైన సరైన సమగ్ర విచారణ జరిపించాలని .కమిటీ సభ్యులు ,దాతలు ,అయ్యప్పస్వామి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఆధ్యాత్మిక దేవాలయం లో రసాభాస :
ఆదివారం దేవస్థానం కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అందులో కొంతమంది కమిటీ సభ్యులు పాలకమండలి తప్పులను ఎత్తిచూపి లెక్కలు చూపించాలని,కొత్తవారికి ,కమిటీ సభ్యత్వం ఇవ్వాలని కోరారు.
దానితో కమిటీ సభ్యులు వెంపటి పురుషోత్తం, ,పయుడిమర్రి కేశవులు ,రమేష్ లమధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దానితో అక్కడే ఉన్న మిగితా సభ్యులు సముదయుంచారు. ఆధ్యాత్మిక వాతావరణం లో ఉండాల్సిన దేవాలయం లో రసాభాసగా..అరుపులు ,కేకలతో దద్దరిలలింది.ఈ సూర్యాపేట పట్టణంలో చర్చనీయాశం అవుతుంది .









