సమానత్వ సమాజం కోసం శ్రమించిన గొప్ప తత్వవేత్త జ్యోతిబా ఫూలే – మంత్రి జగదీష్ రెడ్డి
సమానత్వ సమాజం కోసం శ్రమించిన గొప్ప తత్వవేత్త జ్యోతిబా ఫూలే
జ్యోతిబా ఫూలే సేవలను స్మరించుకొన్న మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట లో వైభవంగా మహాత్మా జ్యోతిబా ఫూలే 197 వ జయంతి వేడుకలు
సూర్యాపేట, మనసాక్షి :
భారత దేశానికి వెలుగు ప్రసాదించిన మహనీయుడుమహాత్మా జ్యోతి బా పూలే అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జ్యోతిబా ఫూలే 197 వ జయంతి సందర్భంగా సూర్యాపేట లోని పూలే విగ్రహానికి మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూసామాజిక దార్శనికుడుగా, సంఘసంసర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు ఫూలే అని మంత్రి జగదీష్ రెడ్డి స్మరించుకొన్నారు. వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే అని కొనియాడారు.
2014 కు ముందు పాలించిన పాలకులు పూలే ఆశయ సాధన కు వ్యతిరేఖంగా పాలన కొనసాగిస్తే,జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.
సబ్బండవర్ణాల సాధికారత, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వెనకబడినవర్గాల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటుచేసి, అన్ని నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు నెలకొల్పిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను స్థాపించిందని, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని చెప్పారు.బలహీనవర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. బహుజనుల కోసం ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలను నిర్మించిన కేసిఆర్ ప్రభుత్వం బీసీ వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వివరించారు.
వృత్తులవారీగా ప్రోత్సాహకాలు అందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతూ, వారి జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని అన్నారు. ఫూలే ఆశయ సాధన దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వ కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి పునరుద్ఘాటించారు.
కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జాయింట్ కలెక్టర్ మోహన్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపిక, వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్య నారాయణ, కార్మిక నాయకులు వై.వెంకటేశ్వరరావు ,
బిసి సంక్షేమ సంఘం నాయకులు వసంత సత్యనారయణ పిల్లే, చల్ల మల్ల నర్సింహ, శారద దేవి,ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు చినశ్రీరాములు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్ల మళ్ళ హసెన్, తప్ప్పెట్ల శ్రీరాములు,స్థానిక కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు తాహెర్ పాషా, రాజేష్, అభినయ్, జ్యోతి శ్రీ విధ్య, మున్సిపల్ కమీషనర్ రామానుజుల రెడ్డి, ఆర్డీవో రాజేంద్ర కుమార్, డాక్టర్ రామూర్తి యాదవ్,
తదితరులు పాల్గొన్నారు..










