Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలురంగారెడ్డి

సర్వమత సామరస్యానికి ప్రతీక తెలంగాణ – హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ

సర్వమత సామరస్యానికి ప్రతీక తెలంగాణ – హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ

మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి

సర్వమత సామరస్యానికి ప్రతీక తెలంగాణ అని హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ అన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లోని మసీదుల ప్రెసిడెంట్స్, ప్రధాన కార్యదర్శి లకు మసీదు ఇమాం, మౌసమ్ లకు మినిస్టర్స్ క్వార్టర్సలో గురువారం తోఫా రంజాన్ కానుకలను పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలు, అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతలను కల్పిస్తూ. మునుపెన్నడు ఎరగని విధంగా అన్ని పండుగలకు కానుకలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ సర్వమత సామరష్యానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు సాయి జేన్ శేఖర్,
బిఆర్ఎస్ మైనార్టీ సెల్ ఉప్పల్ నియోజకవర్గ ప్రెసిడెంట్ బద్రుద్దీన్, బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు కాటర్ల భాస్కర్, నేమూరి మహేష్ గౌడ్, ఇంద్రయ్య, గోలి శ్రీనివాస్, బేతాళ బాల్ రాజు, శేంకర్, మాస శేఖర్, జంగీర్,పాషా, పవన్, అంజీ, శ్రీశైలం, ఉప్పల్ ఖాన్, అరవింద్, మోహన్, లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు