వడగండ్ల వానతో భారీ నష్టం
వడగండ్ల వానతో భారీ నష్టం
నష్టపరిహారం ఇప్పించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా
అర్వపల్లి , మన సాక్షి :
అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయి రైతులకు కంటనీరు మిగిలింది. దిక్కుతోచని స్థితిలో రైతులు మారారు.
భారీ వర్షం వడగండ్ల వానతో సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని రైతులు భారీగా నష్టపోయారు. శనివారం రాత్రి ఒకసారి వచ్చిన ఈదురుగాలులు వడగండ్ల వానతో రైతులు భారిగ నష్టపోయారు
మండల పరిధిలోని కాసర్లపాడు , వేల్పుచర్ల, రామన్నగూడెం , కుంచమూర్తి ,ఉయ్యాలవాడ, తిమ్మాపురం గ్రామాలలో రైతులకు భారీగా నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. మామిడి తోటలో కాయలతో పాటు ఆకు లేకుండా రాలిపోయాయి.
కోతకు వచ్చిన పంట రాళ్ల వర్షంతో నేలపాలు అయింది. కొంచెంమర్తి గ్రామంలో రేకుల ఇండ్లు గాలికి కొట్టుకుపోయాయి గ్రామాలలో నష్టపరిహారం అంచనాకు వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జనగాం సూర్యాపేట ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
మండలంలో 50, 60 సంవత్సరాల నుండి ఇంతటి విపత్తును చూడలేదని గ్రామస్తులంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఎకరానికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని రైతులు కోరుతున్నారు.












