Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవ్యవసాయంసూర్యాపేట జిల్లా
సూర్యాపేట : ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన రేవంత్ రెడ్డి
సూర్యాపేట : ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన రేవంత్ రెడ్డి
సూర్యాపేట రూరల్, మనసాక్షి
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగి రైతులతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో టీఎస్పీఎస్సీ పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, విద్యార్దులతో జరిగే నిరసన కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో ఆగారు.
ధాన్యం విక్రయాల్లో జరిగే ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను రేవంత్ రెడ్డికి చెప్పుకున్నారు ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి ఉన్నారు.









