Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

మిర్యాలగూడ : మళ్లీ భాస్కర్ రావే పోటీ, సిపిఎం పోటీ చేస్తున్నడంలో వాస్తవం లేదు – గుత్తా 

మిర్యాలగూడ : బిఆర్ఎస్ తరపున మళ్లీ భాస్కర్ రావే పోటీ, సిపిఎం పోటీ చేస్తున్నడంలో వాస్తవం లేదు – గుత్తా 

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టణంలోని శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్ లో జరిగిన బి .ఆర్ యస్ పార్టీ ప్రజా ప్రతినిధుల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు , బి ఆర్ ఎస్ యువ నేత నల్లమోతు సిద్దార్థ ఘనంగా స్వాగతం పలికారు.

 

ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టి ఆర్ యస్ పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల ఆవశ్యకత కోసం బి ఆర్ యస్ పార్టీ గా మారింది అన్నారు.

 

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చట్టవ్యతిరేకమైన చర్యలకు చరమగీతం పాడాలని కెసిఆర్ గారు దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రములో అమలవుతున్న పథకాలు దేశం మొత్తం అమలు కావాలని దేశ ప్రజలు కోరుతున్నారు అన్నారు.

 

కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి అమిత్ షా మొన్న చేవెళ్ల సభలో ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తాం అనడం రాజ్యాంగానికి విరుద్ధమని, ముస్లిం ప్రజలు భారతదేశ పౌరులు కాదా ? వారిని అభివృద్ధి చేసుకొనే బాధ్యత కేంద్రానిది కాదా అన్నారు.

 

మళ్ళీ బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ..
హ్యాట్రిక్ విజయం సాధిస్తాం అన్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్ రావు పని తీరు అద్భుతంగా ఉంది. మళ్ళీ భాస్కర్ రావు గారు విజయం సాధించడం పక్కా అన్నారు. రానున్న ఎన్నికల్లో మిర్యాలగూడలో సిపిఎం పోటీ చేస్తోంది అనడంలో వాస్తవం లేదని, మళ్ళీ మిర్యాలగూడలో భాస్కర్ రావు పోటీలో ఉంటారని అన్నారు.

 

కాంగ్రేస్ ,బిజెపి నాయకులకు రాష్ట్ర అభివృద్ధి పైన యామ లేదు. కేవలం అధికారంలోకి రావాలి ,దోచుకొని తినాలి అనేది వల్ల కుట్ర అని, తెలంగాణ ప్రజలు మతతత్వ పార్టీని అస్సలు విశ్వసించారు .బిజెపి పార్టీ తెలంగాణ లేనే లేదు.వాళ్ళు పగటి వేశగాళ్ళు మాత్రమే అన్నారు.

 

కాంగ్రెస్ పార్టీ అగమ్యగోచరంగా ఉంది. పార్టీ కష్టాల్లో ఉన్న ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆగడం లేదు .
మళ్ళీ నేను సీఎం అంటే నేను సీఎం అని కాంగ్రెస్ పార్టీలో డజన్ల మంది కొట్టుకు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలననే తెలంగాణ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష అని, ఈ నాలుగు నెలలు బి ఆర్ యస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరు శ్రమించాలి అన్నారు.

 

పార్టీ బాగుంటేనే మనం బాగుంటమనేది అందరం యాదిలో పెట్టుకొని పని చేసుకోవాలని,కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కి అడ్డంకిగా మారిందని అన్నారు. కేంద్రం పార్లమెంటు లో బిల్లును ఆమోదించకున్న గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కి దక్కిందని,
రాయల తెలంగాణ అంశం ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని. జె.సి దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ అనడంలో అర్ధంలేదు అన్నారు.

 

తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి ని చూసి ఆంధ్ర ప్రజలు కూడా అక్కడ బి ఆర్ యస్ పార్టీని ఆదరిస్తున్నారని, వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఉన్న పేరుని ఆయన కూతురు షర్మిల బ్రష్టు పట్టిస్తోంది . ఆమె తెలంగాణ పోలీసులపైన దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. ఆమెకి రాజకీయాలు ఆసక్తి ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి. ఇక్కడ ఎం పని అన్నారు.

మరిన్ని వార్తలు