నల్గొండ : దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారు
నల్గొండ : దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారు
నల్గొండ , మన సాక్షి:
వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 20 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిది (CMRF)పథకం ద్వారా మంజూరు అయిన Rs.6,33,000/-విలువ గల చెక్ లను బుధవారం నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ర్ట ప్రభుత్వం అందించని పథకాలను మన రాష్ట్ర సర్కారు అమలు చేస్తోందని అన్నారు. అందుకే యావత్ దేశ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కావాలని ఆశిస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర రావు,తదితరులు పాల్గొన్నారు.









