Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : 20వేల బస్తాలే సేకరించారా..!

సూర్యాపేట : 20వేల బస్తాలే సేకరించారా..!

మంత్రి జగదీష్ రెడ్డి దాన్ని ముక్కోనుగోళ్లపై విస్మయం

సూర్యాపేట మన సాక్షి :

రబీ పంట కొనుగోళ్ల పై సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, యస్ పి రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ లో జిల్లా నుండి కొనుగోళ్ల లక్ష్యం ఏడు లక్షల నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 20 వేల బస్తాలు మాత్రమే సేకరించడం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.

 

213 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా .. ఇంత తక్కువ సేకరించడం ఏమిటంటూ అధికారులను ఆయన నిలదీశారు. ధాన్యం కొనుగోళ్ళకు ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

 

జిల్లాలో 72 రైస్ మిల్లులు ఉండగా 37 మిల్లులు మాత్రమే ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడం ఎందని ఆయన అధికారులను ప్రశ్నించారు. అదే సమయంలో అటు రైస్ మిల్లర్లు ఇటు ట్రాన్స్ పోర్ట్ యజమానులు అలసత్వం ప్రదర్శించ రాదని ఆయన పేర్కొన్నారు. సరిపడ హామిలీలను యుద్ద ప్రాతిపదికన నియమించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.

 

నాణ్యత ప్రమాణాల పేరుతో కోతలు వలదని ఆయన సూచించారు. అదే సమయంలో రైతులకు నాణ్యత అంశంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీదనే ఉంటుందన్నారు. అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు అధికారులు బాసటగా నిలబడాలని అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.

 

సి యం ఆర్ బియ్యం అక్రమాలపై మంత్రి జగదీష్ రెడ్డి కొరడా ఝళిపించారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారినుండి రికవరీ చెయ్యాలని అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. అంతే కాకుండా డీ-ఫాల్టర్ల పై దృష్టి సారించాలన్నారు. తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన పడొద్దని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అదేశించారన్నారు.

 

అకాల వర్షాలకు పంట నష్టం వివరాలు సే కరిస్తూన్నట్లు ఆయన ప్రకటించారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి రైతులను ఆదుకుంటామని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల తో పాటు అకాల వర్షాలకు సంభవించిన పంట నష్టంపై చిల్లర రాజకీయాలు తగదని ఆయన విపక్షాలకు ఉద్బోధించారు. వ్యవసాయానికి గౌరవం పేరిగిందీ అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ చలువతోటే అన్నది ప్రపంచానికి తెలుసు అని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు