Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

మిర్యాలగూడ : మాస్ కాపీయింగ్ లేకుండా చూడాలి

మిర్యాలగూడ : మాస్ కాపీయింగ్ లేకుండా చూడాలి

మిర్యాలగూడ, మనసాక్షి :

ఓపెన్ ఇంటర్, పదవ తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కుష్బూ గుప్త అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల , బకల్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 

పరీక్షా కేంద్రాలలో ఫ్యాన్లు, లైట్లు తప్పనిసరిగా ఉండాలని మండల విద్యాధికారిని ఆదేశించారు. పరీక్షలకు ముందు పురుషులను మహిళలను వేరువేరుగా పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ చేసి గదులకు పంపాలని పేర్కొన్నారు. మాస్ కాపీ జరగకుండా సిట్టింగ్ స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

.

ఇంటర్మీడియట్ పరీక్షల కు 506 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 463 మంది విద్యార్థులు హాజరయ్యారని, 43 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు ఈరోజు 21 మంది హాజరు కావలసి ఉండగా 12 మంది హాజరయ్యారని 9మంది గైర్హాజరు అయ్యారని పేర్కొన్నారు.

 

వారి వెంట మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్, మండల పంచాయతీ అధికారి వీరారెడ్డి లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు