Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె నోటీస్

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె నోటీస్

సూర్యాపేట , మనసాక్షి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 4సంవత్సరాలు గడువు పూర్తి అయినప్పటికీ జేపీఎస్ లను రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులు రానందున తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 28నుండి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు టిపిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయ్ తెలిపారు.

 

సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో టిపిఎస్ ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జేపీఎస్ లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు కు సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శి లను వెంటనే జీవో విడుదల చేయాలని, గడిచిన నాలుగు సంవత్సరాల ప్రొహిబిషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలని కోరారు. ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి లను జేపీఎస్ గా ప్రమోట్ చేసి రెగ్యులర్ చేయలని డిమాండ్ చేశారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రేంత్ ని నిర్దారించి ప్రకటించాలన్నారు. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఓపిఎస్ లను జేపీఎస్ గా కన్వర్ట్ చేసి ఓపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 

317జీవో వల్ల నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు చేసి పరస్పర బదిలీలు, స్పోస్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యాక్రమంలో టిపిఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి అశోక్ కుమార్
స్వామీ, రజిని, భక్కయ్య, సతీష్, సౌరిక, నరసింహ, సొందు, నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు