Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

మిర్యాలగూడ : పరీక్షల్లో చూసి రాస్తే ఓ రేటు, మరొకరు రాస్తే మరో రేటు..!

మిర్యాలగూడ : పరీక్షల్లో చూసి రాస్తే ఓ రేటు, మరొకరు రాస్తే మరో రేటు..!

మిర్యాలగూడ, మనసాక్షి :

పరీక్షలు రాసేవారు అంతా.. పదోన్నతుల కోసం, ఉద్యోగాల కోసం రాసే వారుంటారు. రోజువారి కార్యక్రమాల వల్ల వారు పరీక్షలకు చదివి… ఉత్తీర్ణత సాధించే పరిస్థితి ఉండదు. అందుకని ఇదే అదునుగా భావించిన ఓపెన్ దందాకు నిర్వాహకులు తెర లేపారు. ఇది ప్రతి ఏటా సాగుతున్న తంతే కానీ ఈసారి మరి కాస్త ఎక్కువ అని చెప్పవచ్చును.

 

రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీ… పదవ తరగతి పేపర్ లీకేజీ తో నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళన చెందడంతో పాటు రాజకీయ రంగు పులుముకుని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసే స్థాయికి వెళ్ళిన విషయం తెలిసింది. అయినా… నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అవేమీ పట్టనట్లుగా పరీక్షల నిర్వహణ అడ్డగోలుగా సాగుతుందని చెప్పవచ్చును. ఓపెన్ పరీక్షల దందాకు తెరలేపి పరీక్ష రాస్తున్న ప్రతి విద్యార్థి డబ్బులు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పరీక్ష రాయకుండా వేరే వారితో పరీక్షరాపిస్తే ఓ రేటు… చూచి రాస్తే మరో రేటు ఇలా ఫిక్స్ చేశారు.

 

ఒకరి బదులు ఒకరు రాసేందుకు రూ. 2500, చూచి రాస్తే రూ. 1000 చొప్పున ప్రతి అభ్యర్ధి నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.
తొమ్మిది రోజుల పాటు ఏ రోజుకు ఆ రోజే వసూలు చేస్తున్నట్లు సమాచారం. పరీక్షల పేరుతో లక్షల రూపాయల్లో దందా కొనసాగుతుంది.

 

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని .. బకల్ వాడీ, ప్రభుత్వ పాఠశాల, సెయింట్ మేరీస్ స్కూల్ మొత్తం ఐదు.. సెంటర్లలో ఈనెల 25వ తేదీన ప్రారంభమైన ఓపెన్ సొసైటీ ఇంటర్, టెన్త్ పరీక్షలు… నిర్వాహకుల జేబులు నింపుతున్నాయి. …ఓపెన్ టెన్త్ ,ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే ఈ పరీక్షల. బాధ్యతలు చేపట్టే నిర్వాహకులకు మాత్రం రోజుల వ్యవధిలో … లక్షలు దండుకునే అవకాశం వచ్చింది.

 

బకల్ వాడీ, మిర్యాలగూడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో… ఇంటర్ పరీక్షలు, సెయింట్ మేరీస్, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలల్లో మొత్తం 5 సెంటర్లలో ఇంటర్ విద్యార్థులు 506, పదవ తరగతి విద్యార్థులు 250 మంది పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు సుమారు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.

 

ఇప్పటికే మూడు రోజుల పరీక్షలు పూర్తి కాగా…అభ్యర్ధుల నుంచి వసూళ్ల పర్వం…సాఫీగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరీక్షల నిర్వహణలో…విధులు నిర్వర్తిస్తున్న…అందరి అధికారులను ఈ పరీక్షల నిర్వహకులు మేనేజ్ చేసి తమ దందాను సాగిస్తున్నట్లు…ప్రచారం సాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు…దృష్టి సారించాలని పలువురు కోరారు.

 

పరీక్షల్లో అక్రమాలు, వసూళ్లు చోటు చేసుకుంటున్న విషయంపై మండల విద్యాధికారి బాలాజీ నాయక్ ను వివరణ కోరగా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు నిర్వాహకులే బాధ్యత వహిస్తారని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు