30 years : ముప్పై ఏళ్ల తర్వాత వారు మళ్లీ కలుసుకున్నారు..!
30 years : ముప్పై ఏళ్ల తర్వాత వారు మళ్లీ కలుసుకున్నారు..!
మేళ్లచెరువు,మనసాక్షి:
కలిసి చదువుకున్నారు.. పదో తరగతి వరకు పాటలు, ఆటలు ఆడుకొని చదువుకున్న సంఘటనలను గుర్తు చేసుకున్నారు ఆ పూర్వి విద్యార్థులు. 30 సంవత్సరాల తర్వాత కలిసిన అపూర్వ విద్యార్థులు వృత్తి , ఉద్యోగాలలో ఎక్కడెక్కడో స్థిరపడ్డారు కానీ ఎంతో ఆనందంగా మళ్ళీ పాత జ్ఞాపకాలు చేసుకుంటూ గడిపారు.
ముప్పై ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని దొండపాడులో జరిగింది.1990-91 బ్యాచ్ విధ్యార్ధులు నాటి ఉపాద్యాయులతో కల్సి ఆనాటి అనుభూతులను, అనుభవాలను పంచుకున్నారు.
టీచర్లు నేర్పిన క్రమశిక్షణను గుర్తు చేసుకున్నారు. హోదాలను మరిచి ఉత్సాహంగా చిన్నపిల్లలుగా మారి ఆనందాన్ని పంచుకున్నారు.మరోసారి పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు.
కార్యక్రమం లో టీచర్లు రామారావు,నర్సింహాచారి,మోహన్ రెడ్డి,రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.









