హనుమకొండ : వడగండ్ల వర్ష బీభత్సం
హనుమకొండ : వడగండ్ల వర్ష బీభత్సం
తడిసి ముద్ద అయిన ధాన్యం. మొక్కజొన్న , మిర్చి
శాయంపేట, మనసాక్షి:
హనుమకొండ జిల్లా, శాయంపేట మండలం వివిధ గ్రామంలో సోమవారం రోజున కురిసిన భారీ వర్షానికి రైతుల చాలా ఇబ్బందులు పడిన సంఘటన…..
మండలం అంతట వడగండ్లతో కురుస్తున్న వర్షంతో సోమవారం రాత్రి కురిసిన అకాల భారీ వర్షానికి మరి కొన్ని ప్రాంతాలలో వరి పంట నేరవారిపోయింది.
ఇదివరకే కోతదశలోనున్న నేలవాలిన వరి పంట ధాన్యం గింజలు కురుస్తున్న వర్షానికి మాడులలో నీళ్లు నిలిచి మొలకెత్తుతున్నాయి. వివిధ గ్రామాల్లో మొక్కజొన్న ,మిర్చి, ఉద్యానవన పంటలు అన్ని పంటలు రైతులు ఆరుగాలము శ్రమించి రాత్రి పగలు అని అలుపెరగకుండా పండించిన పంట కాస్త చేతికందే సమయానికి ఆదిలో తొలకరి జల్లుయై, మిత్రువై, కాంతినిచ్చి, కాపు కాసి పంట పండడానికి ఆశలు చిగురింప చేసిన మేఘమే తుదకు చేతికి వచ్చిన పంటను చూసి అక్కసుతో వడగళ్ళను కురిపించి రైతు కంట కన్నీరు జార్చేలా చేస్తున్న కాలానికి శాంతింపవమ్మా అని మొక్కుతూ అనన్యంగా రైతుల రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కురుస్తున్న అకాల వర్షానికి తీవ్రంగా ఉందిపంటలు నష్టపోయామని తమని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామాలలోని రైతులు తమ గోడును వెళ్ళబోస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని అగ్రికల్చర్ ఆఫీసర్ మొక్కజొన్న పడిన వాళ్లనే ఇవ్వమన్నారు తక్షణమే వరి పంట నేల వాలిన రైతులకు న్యాయం చేయాలని కోరమైనది









