సూర్యాపేట : రూపు రేఖలు మారిన మెయిన్ రోడ్డు
సూర్యాపేట : రూపు రేఖలు మారిన మెయిన్ రోడ్డు
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట పట్టణంలో ని పాత జాతీయ రహదారి మెయిన్ రోడ్ విస్తరణకు ఇటీవల హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.గత వారం రోజుల నుండి జరుగుతున్న పనులలో భాగంగా గురువారం ఉదయం తారు రోడ్డు వేయడం మొదలుపెట్టారు. దీంతో ఆప్రాంత వ్యాపారులు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకాలం గుంతలు , మట్టి, బురద మయముగా రోడ్డు ఉండేది అయితే ఆప్రాంతంలో తిరిగేందుకు ప్రజలు ఇష్టపడేవారు కాదు.దింతో ఆ ప్రాంతంలోని దుకాణం దారులకు వ్యాపారాలు లేక కిరాయిలు కట్టలేక మడిగలు ఖాళీగా వుండేవి. స్వంత దుకాణాలు నడిపేవారు అప్పుల పాలయిన పరిస్థితి ఏర్పడింది. కాని విస్తరణ పనులు మొదలైన తరువాత వ్యాపారులు సంతోషంగా ఉన్నారు. తారు రోడ్డు వేయడంతో మెయిన్ రోడ్ రూపు రేఖలు మారిపోయాయి.
ఇకపై మడిగలు అద్దెకు దొరికే పరిస్థితి నెలకొనవచ్చు . పూలసెంటర్, బొడ్రాయి బజార్ రోడ్డులో పూజ వస్తువులు, స్టీల్, రాతెండి, ఇత్తడి, బంగారు నగలు, బట్టల దుకాణాలు అన్ని రకాల వ్యాపారస్తులు వారి దుకాణాలు కస్టమర్ లతో కళకళలాడుతాయని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









