Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

నల్గొండ : డైట్ ఫ్యాకల్టీ భాను ప్రకాష్ కి డాక్టరేట్

నల్గొండ : డైట్ ఫ్యాకల్టీ భాను ప్రకాష్ కి డాక్టరేట్

నల్గొండ , మనసాక్షి :

నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ఇ.యల్. టి. సి ఫ్యాకల్టీ తండు భాను ప్రకాష్ గౌడ్ కు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ఎడ్యుకేషన్ విభాగంలో డాక్టరేట్ పట్టా పొందారు.

 

2008 లో పార్ట్ టైం పరిశోధన విద్యార్థిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగంలో చేరారు.
యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం ఈ ఎస్ ఎలిజిబెత్ పర్యవేక్షణలో ఉపాధ్యాయుల మెటాకాగ్నిషన్ అవగాహణ , సంస్థాగత నిబద్ధత, సెకండరీ విద్యార్థుల విద్యా పనితీరుపై ఎలాంటి ప్రభావం కలిగి ఉందనే అంశంపై పరిశోధనలను చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ కు సమర్పించిన పరిశోధన గ్రంథానికి గాను తండు భాను ప్రకాష్ గౌడ్ కి ఎడ్యుకేషన్ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు యూనివర్సిటీ రిసర్చ్ సెల్ అండ్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ పి కిరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు.

 

భానుప్రకాష్ గౌడ్ నల్గొండ జిల్లా సూర్యాపేట లో జన్మించారు. విద్యాభ్యాసం మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి హై స్కూల్ అభ్యసించారు. అప్పటి స్కూల్ హెడ్ మాస్టర్ కే జ్ రూఫుస్ భానుప్రకాష్ ప్రతిభను గుర్తించి చదువు లో ఎంతగానో ప్రోత్సహించారు.

 

భాను ప్రకాష్ గౌడ్ నాన్న నర్సయ్య,అమ్మ లక్షమ్మ నాన్న మండల రెవిన్యూ ఆఫీసర్ గా జిల్లా లోని పలు ప్రాతాల లో విధులు నిర్వహిచారు. ప్రకాష్ 2009 టీచర్ ఉద్యోగం సంపాదించారు. దేవరకొండ గవర్నమేంట్ స్కూల్ విధులు నిర్వహిచారు. ఆ తరువాత 2015 నల్గొండ లోని గవర్నమేంట్ బాయ్స్ హై స్కూల్ నిర్వహిచారు. ప్రసూతం
ఏ ల్ ట్ సి ఆఫీసర్ ఇంచార్జి గా విధులు నిర్వహిచారు.

 

రీజినల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్టం నుండి 160 మంది లో భాను ప్రకాష్ టాపర్ గా నిలిచి అప్పటి జిల్లా కలెక్టర్ స్వయంగా ఏ ల్ ట్ సి ఆఫీసర్ ఇంచార్జి గా పోస్ట్ చేయడం జరిగింది.

 

ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ IUCTE వారు సర్టిఫికెట్ ఇన్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ మెథడాలజీ CERM కోర్సు ను ఎన్సీ.ఈ.ఆర్టీ వారి ఆధ్వర్యంలో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఐ మైసూర్ లో నిర్వహిస్తారు. ఈ కోర్సు ను 2019 లో పూర్తి చేయడం జరిగింది.

ఎడ్యుకేషనల్ రీసర్చ్ మెథడాలజీ కోర్సులో భాగంగా ప్రాజెక్టు రిపోర్ట్ను సమర్పించడం జరిగింది. నల్గొండ జిల్లా ప్రభుత్వ డైట్ కళాశాల విద్యార్థుల వైఖరి అనే అంశం పైన ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సమర్పించడం జరిగింది.

అంతేకాక 2008లో ప్రత్యేక విద్యలో అయినా మెంటల్ రిటర్డే చిల్డ్రన్ (M.R) సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ ఎం ఆర్ అనే కోర్సు ను టాగూర్ హరిప్రసాద్ రిహారిబ్రషన్ ఇన్స్టిట్యూట్లో దిల్ సుఖ్ నగర్ హైదరాబాద్ లో పూర్తి చేశాను.

మరిన్ని వార్తలు