Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
BREAKING : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన ఇసుక లారీ
BREAKING : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన ఇసుక లారీ
వెంకటాపురం , మనసాక్షి.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని యోగితా నగర్, మహితా పురం కాలనీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

ప్రయాణికులతో వెళుతున్న ఆటోను, ఇసుక లారీ ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ ,108 అంబులెన్స్ లో వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు చికిత్సకు తరలించారు.
వీరిలో పలువురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










