Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Zeero shadow day : నీడ కనిపించంది ఈరోజే.. టైం ఎప్పుడంటే..!

Zeero shadow day : నీడ కనిపించంది ఈరోజే.. టైం ఎప్పుడంటే..!

మనసాక్షి , హైదరాబాద్ :

మధ్యాహ్నం వేళలో సూర్యుడు ప్రతాపం ఉంటుంది. ఆ సమయంలో సూర్యుని వెలుతురుకు నీడ కనిపించదంటే ఆశ్చర్యంతో పాటు అద్భుతంగా ఉంటుంది. అయితే ఇలాంటి సంఘటన ఇటీవలనే బెంగళూరులో చోటుచేసుకుంది. ఇక హైదరాబాదులో కూడా అలాంటి అద్భుతమైన సంఘటన మంగళవారం రాబోతుంది.

 

ఏప్రిల్ 25వ తేదీన బెంగళూరులో జీరో జీరో షాడో డే ఆవిష్కృతమైంది. అంటే సూర్యుడి వెలుగు దేని మీద పడినా నీడ వస్తుంది. కానీ బెంగళూరులో ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 :17 గంటలకు జీరో షాడో ఏర్పడింది. 60 నుంచి 120 సెకండ్ల పాటు ఆరోజు ఆ నీడ కనపడలేదు.

నీడ భూమిపై కనిపించకపోవడాన్ని బెంగళూరు వాసులు ఆస్వాదించారు. అయితే ఈ అసాధారణమైన సంఘటన రాబోయే రోజుల్లో హైదరాబాదీలు కూడా చూడ కలగనున్నారు. ఈ రోజు ( మంగళవారం) 9 వ తేదీ మధ్యాహ్నం 12 : 12 గంటలకు ఈ అరుదైన జీరో షాడో డే ఆవిష్కృతం కానున్నది.

 

సాధారణంగా కర్కటరాశి మరియు మకరరాశి మధ్య ప్రాంతాలలో జీరో షాడో ఏర్పడుతుంది. ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఉత్తరాయణం.. దక్షణాయం రెండింటిలోనూ సూర్యుని క్షీణత అక్కడి అక్షాంశానికి సమానంగా ఉంటుంది. ఆ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నిట్టనిలుగా పడతాయి. అందువల్ల నిలువుగా ఉండే ఏదైనా వస్తువు లేదా జీవులు నీడను ఏర్పరచలేవు.

మరిన్ని వార్తలు