Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుసూర్యాపేట జిల్లా

భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

కోదాడ , మనసాక్షి :

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో తెల్లవారుజాము నుండే స్వామివారికి పంచామృత అభిషేకాలు, ఆకు పూజ, విశేషా అలంకరణ, నీరాజనా మంత్రపుష్పాలు, హనుమాన్ హోమం, పూర్ణాహుతి, తిరొక్క పూలతో స్వామివారిని అలంకరించి  ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

 

పట్టణంలోని శ్రీరంగాపురం లో గల ఆంజనేయ స్వామి దేవాలయం, వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఉన్న హనుమాన్ ఆలయం, గుంటి రఘునాధ స్వామి దేవాలయంలో గల ఆంజనేయస్వామి దేవాలయం,బాలాజీ నగర్ లో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కనుల పండువగా నిర్వహించారు.

 

కాగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని. జైశ్రీరామ్, జై హనుమాన్, రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి  అంటూ జై ఆంజనేయ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి.అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్ని ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో జూకూరి అంజయ్య, దేవరశెట్టి హనుమంతరావు, గుడుగుంట్ల రంగయ్య, బాలాజీ నగర్ ఆంజనేయ స్వామి అర్చకులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు