Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుపండుగలుసూర్యాపేట జిల్లా

SURYAPET : అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షులుగా రంగు ముత్యం రాజు

అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షులుగా రంగు ముత్యం రాజు

సూర్యాపేట : మనసాక్షి

అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సూర్యపేట జిల్లా అధ్యక్షులుగా రంగు ముత్యంరాజు గురు స్వామిని నియమించారు. ముత్యంరాజు అయప్ప స్వామి సీనియర్ గురస్వామిగా, జర్నలిస్ట్ గా ఉన్నారు.పలు ఆధ్యాత్మిక, కార్యక్రమాలలో చురుకుగా పాలుగోని, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

 

గతంలో ధర్మ ప్రచారం సభకు జిల్లా ప్రధాన కార్యదర్శి గా ,శబరిమల ఏరిమెలి అన్నదాన భవన నిర్మాణ కమిటీ సభ్యులు గా సేవలు అందిస్తున్నారు. ఇటీవల పూడూరు అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమల రావు ప్రధాన కార్యదర్శి పుల్లంరాజుల నేత్రత్వంలో కమిటీని ఎంపిక చేశారు.

ALSO READ : సూర్యాపేట : ఎలుగుబంటి కలకలం  (వీడియో వైరల్)

 

జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూపతి శ్రీనివాస్ గౌడ్ గురు స్వామి కోశాధికారిగా మాశేటి నరేష్ సహాయకార్యదర్శి గా ఎస్ శ్రీనివాస్ ,పి ఆర్ ఓ గా రాపర్తి మహేష్ కుమార్ ,కమాండెంట్ గా సుంకాని శ్రీనివాస్ ల తో పాటు మరో 12 మంది కార్యవర్గ సభ్యులు గా నియమించారు.

 

ఈ సందర్భంగా రంగు ముత్యంరాజు గురుస్వామి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో నాకు అప్పగించిన బాధ్యత ను అంకిత భావంతో పని చేసి ధర్మప్రచార సభ అభ్యున్నతి కి కృషి చేస్తానని అన్నారు.అయ్యప్ప స్వామి దీక్షా నియమాలు స్వాములకు వివరిస్తూ ,స్వామి పైన భక్తి భావము పెరిగేలా కృషి చేస్తానని చెప్పారు .

 

భక్తుల సహకారంతో పలు ఆధ్యాత్మిక ,సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.. నా నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షుడు ఆయప్పదాస్ కు ,రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు