Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్తెలంగాణహైదరాబాద్

Smartphone Tips : మీ స్మార్ట్ ఫోన్ కు బ్యాక్ కేస్ ఉందా..? అయితే ఇది తప్పక చూడాల్సిందే..!

Smartphone Tips : మీ స్మార్ట్ ఫోన్ కు బ్యాక్ కేస్ ఉందా..? అయితే ఇది తప్పక చూడాల్సిందే..!

మనసాక్షి , వెబ్ డిస్క్:

మీ స్మార్ట్ ఫోన్ కు బ్యాక్ కేస్ వేయించుకున్నారా..? సేఫ్టీ కోసం ఇది ప్రతి ఒక్కరు చేసే పనే. కానీ బ్యాక్ కేస్ వేసుకోవడం వల్ల ఎంత అయితే ఉపయోగం ఉంటుందో.. దానివల్ల నష్టాలు కూడా ఉంటాయి. అయితే బ్యాక్ కేస్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

 

స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారు ఫోను జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటారు. ఫోన్ పై ఎలాంటి గీతాలు పడినా తట్టుకోలేరు. అందుకోసం ఒకవేళ ఫోన్ కిందపడినా.. ఏం కావద్దని ఆలోచనతో బ్యాక్ కేసును వేయిస్తూ ఉంటారు ఇది సర్వసాధారణం.

 

ఫోన్ బ్యాక్ కేస్ వాడటం వల్ల కలిగే నష్టాలు :

1. ఫోన్ కు బ్యాక్ కేస్ (కవర్) ఉండటం ద్వారా అది త్వరగా వేడెక్కుతుందంట. వేడెక్కడం వల్ల ఫోన్ స్లో అవుతుంది. వేగంగా హ్యాంగ్ అవుతుంది.

 

2. మీరు నాణ్యమైన మంచి ఫోన్ కవర్ కొనకపోతే దానిపై బ్యాక్టీరియా పేరుకుపోయి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

 

3. ఫోన్ కవర్ ఉండడం వల్ల చార్జింగ్ పెట్టగానే వేడెక్కడం ప్రారంభమవుతుంది. దాంతో ఫోన్ త్వరగా ఛార్జింగ్ కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

 

4. కొంతమంది ఫోన్ బ్యాక్ కవర్ కు మాగ్నెట్ ఉంటుంది. దాని వల్ల జిపిఎస్ కు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

 

5. ఫోన్ బ్యాక్ కవర్ ఉపయోగించడం వల్ల ఫోన్ డిజైన్, లుక్ అన్ని కనపడకుండా కేవలం కవర్ మాత్రమే కనిపిస్తుంది.

 

జాగ్రత్తలు పాటించడానికి కొన్ని టిప్స్ : 

 

1. మీ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో కవర్ ను తీసివేయాలి.

2. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతున్నా.. వీడియోలు చూస్తున్నా.. సరే బ్యాక్ కవర్ తీసివేయాలి.

3. స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడే సమయంలో కూడా బ్యాక్ కవర్ తీసివేయాలి.

4. మీ ఫోన్ లో ఎక్కువసేపు వీడియోలు తీసే సమయంలో కూడా బ్యాక్ కవర్ తీసివేయాలి.

 

ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మీ ఫోన్ త్వరగా వేడెక్కకుండా, హ్యాంగ్ కాకుండా ఉంటుంది.

మరిన్ని వార్తలు