WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!
WhatsApp : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్, మాటల్లేవ్ .. ఇక మాట్లాడుకోవడాల్లేవ్..!
మనసాక్షి , వెబ్ డెస్క్ :
స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లు వాట్స్అప్ వాడక తప్పడం లేదు. ఇది చాలా ఈజీగా ఉపయోగించే విధంగా అద్భుతమైన ఫీచర్లను ఎప్పటికప్పుడు యూజర్లకు అందిస్తుంది. అందుకోసం యూజర్ల సంఖ్య రోజుకు పెరుగుతుంది.
వినియోగదారుల అవసరాల దృష్ట్యా వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంది. కొత్త ఫీచర్లను వినియోగించి వినియోగదారులు మెసేజ్ లు, ఫోటోలు సెండ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు సరికొత్త ఫీచర్ కీబోర్డును వాట్సప్ ప్రవేశపెట్టింది. దానిలో ఎమోజీలను ప్రవేశపెట్టింది. దానివల్ల ఇక మాటల్లేవ్… మాట్లాడుకోవడాల్లేవు… కేవలం ఎక్స్ ప్రైషన్స్ మాత్రమే ఉంటాయి. అనేలా ఈ వాట్సాప్ ను అప్డేట్ చేసింది. ఇది కొన్ని బీటీ వెర్షన్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది .
వాట్సాప్ కొత్త ఫీచర్ కి సంబంధించిన వివరాలు :
ఎమోజీ కీబోర్డ్ :
వాట్సప్ కొత్తగా ఎమోజీ కీబోర్డును ప్రవేశపెట్టింది. కీబోర్డును పైకి స్క్రోల్ చేయటం కుదిరే విధంగా ఉంటుంది. వాట్సప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ విషయాలను వెల్లడించింది. దానికి సంబంధించిన రిపోర్టు ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.23.12.19 అప్డేట్ లో కొత్త కీబోర్డును అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీనిని ఇన్ స్టాల్ చేసుకున్న యూజర్లకు ఆ కీబోర్డ్ యాక్సెస్ చేయవచ్చును. కొత్త ఎమోజీ కీబోర్డును వారు పైకి స్క్రోల్ చేయటం వస్తుంది. సాధారణంగా కూడా స్టాండర్డ్ వాట్సప్ వెర్షన్ లో అందుబాటులో ఉన్న ఎమోజీ కీబోర్డును ఓపెన్ చేసిన తర్వాత వాటిలో ఉన్న ఎమోజీలు కిందికి పైకి స్క్రోల్ చేయవచ్చును.
కానీ ఎమోజీ కీబోర్డును అంతటా పైకి స్క్రోల్ చేసే వెసులుబాటు లేదు. అయితే కొత్త రీడిజైన్ కీబోర్డును మాత్రం పైకి డ్రాగ్ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా ఎమోజీల డిస్ ప్లేకు సంబంధించి వైడర్ వ్యూస్ పొందవచ్చు . వైడర్ వ్యూలో ఒకేసారి ఎమోజీలు కనిపించడం వల్ల వాటిలో ఏవైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది
ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!
మార్పులు చేసినవి :
వాట్సప్ కొత్తగా తీసుకొచ్చిన రీ డిజైన్డ్ ఎమోజీ కీబోర్డులో మరో మార్పు చేశారు. గిఫ్టులు, ఎమోజీలు, స్టిక్కర్లు అవతార్ వంటి కొత్త ఎమోజీ లను కీబోర్డులో పై భాగంలో చేర్చారు. స్టాండర్డ్ యాప్ వెర్షన్ లో ఈ ట్యాబ్స్ అనేవి కింది భాగంలో ఉంటాయి.
ఇక బీటా టెస్టర్లు , మీడియా షేరింగ్ ఎమోజీ కీబోర్డు, బటన్లు , కొత్త అరెంజ్మెంట్స్ కూడా చేయవచ్చును. ఈ డిజైన్ ఎమోజీ కీబోర్డ్ బీటా టెస్టర్లకు మాత్రమే రిలీజ్ అయింది. మిగతా యూజర్లకు త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుంది.
ఎక్కువమంది చదివిన వార్తలు .. మీరూ చదవాలంటే క్లిక్ చేయండి..👇
- Viral video : ఉప్పుతో గీత గీస్తే నాగుపాము దాటలేదా..? ( వీడియో వైరల్)
- Whatsapp Tricks : వాట్సాప్ ట్రిక్స్.. వాడే వాళ్లంతా తెలుసుకోవాల్సిందే..!
- Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!
- Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!
- Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!










