Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

Whatsapp Multi Account : వాట్సప్ అదిరిపోయే మల్టీ ఎకౌంటు ఫీచర్..!

Whatsapp Multi Account : వాట్సప్ అదిరిపోయే మల్టీ ఎకౌంటు ఫీచర్..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

వాట్సాప్ వినియోగదారులు రోజురోజుకు పెరుగుతున్నారు . మల్టీ నేషనల్ టెక్నాలజీ సంస్థ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తమ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేందుకుగాను కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంది.

 

ఇటీవల అనేక ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ మరోసారి కొత్తగా మల్టీ అకౌంట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దాంతో వాట్సాప్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా చేసుకునే అవకాశం ఉంది. త్వరలో ఈ ఫీచర్ ను ప్రవేశపెడతామని సంస్థ పేర్కొన్నది.

 

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం మల్టీ ఎకౌంటు ఫ్యూచర్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఒకే వ్యక్తి …. ఒకే ఫోన్ నుంచి ఎన్నైనా ఖాతాలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. వాట్సాప్ యూజర్ తొలిసారిగా అదనపు ఖాతాను తీసుకున్న తర్వాత లాగౌట్ చేసే వరకు డివైస్ లో సేవ్ చేయబడుతుంది.

 

ఓకే యాప్ లో వినియోగదారులు వారి వ్యక్తిగత సంభాషణలు, పని సంబంధిత చర్చలు, ఇతర అంశాలను చర్చించవచ్చు.. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచనున్నట్లు పేర్కొన్నది. ప్రస్తుతం మల్టీ ఎకౌంటు ఫీచర్ అభివృద్ధిలో ఉందని, వాట్సప్ అప్లికేషన్ ఫీచర్ బీటా పరీక్షలకు అందుబాటులో ఉందని ఆ సంస్థ పేర్కొన్నది.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి…👇

మరిన్ని వార్తలు