Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

Jp Nadda : తెలంగాణలో కెసిఆర్, ఆయన కొడుకు , కూతురే సంతోషంగా ఉన్నారు – జేపీ నడ్డా

Jp Nadda : తెలంగాణలో కెసిఆర్, ఆయన కొడుకు , కూతురే సంతోషంగా ఉన్నారు – జేపీ నడ్డా

నాగర్ కర్నూల్ , మనసాక్షి :

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కొడుకు కుమార్తె మాత్రమే సంతోషంగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా నవ సంకల్ప సభలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొని మాట్లాడారు.

 

ఈ సందర్భంగా అలంపూర్ జోగులాంబ అమ్మవారికి నమస్కారాలు అని జెపినడ్డా పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు దుఃఖంతో ఉన్నారని అన్నార కేసీఆర్ ఆయన కుమారుడు కుమార్తె మాత్రమే సంతోషంగా ఉన్నారని ఆరోపించారు.

 

ALSO READ : 

  1. CM KCR : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. 30వ తేదీ నుంచి పంపిణీ షురూ..!
  2. Rythu Bandhu scheme : రైతుబంధుపై కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్…!
  3. Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!

మోడీ పాలనలో దేశం పురోగమిస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

 

మోడీ అధికారంలోకి వచ్చాక పేదరికం 10%కు పడిపోయింది అన్నారు. కమల వికాసం తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.?
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ నాలుగు కోట్ల మందికి ఇల్లు నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు.

 

 

విపక్షాల సమావేశంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. కుటుంబ పాలన కావాలంటే బీఆర్ఎస్ కు, సంక్షేమ పాలన కావాలంటే బిజెపికి ఓటేయాలి అన్నారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బిజెపి నాయకులు కిషన్ రెడ్డి ,లక్ష్మణ్ ,డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు