సూర్యాపేట : ద్విచక్ర వాహనాలు , ట్రాక్టర్లు ,ఆటోలు పోలీసుల స్వాధీనం.. !
సూర్యాపేట : ద్విచక్ర వాహనాలు , ట్రాక్టర్లు ,ఆటోలు పోలీసుల స్వాధీనం.. !
సూర్యాపేట , మనసాక్షి
సూర్యాపేట ప్రజల భద్రత,నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పి నాగభూషణం అన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు డిఎస్పి నాగభూషణం, పట్టణ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని 18వ వార్డ్ సుందరయ్య నగర్ లో సూర్యాపేట పట్టణ పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.సరైన ధ్రువ పత్రాలు లేని ముప్పై ఐదు ద్విచక్రవాహనాలు,మూడు ట్రాక్టర్, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగభూషణం,సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై,పాత నేరస్తుల కదలికపై నిరతరం నిఘా ఉంటుందన్నారు.
🟢 ఎక్కువమంది చదివిన వార్తలు మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి👇
- Pink WhatsApp: అప్ గ్రేడ్ పేరుతో పింక్ వాట్సప్.. ఆ మోసం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
- RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
- PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!
- Viral Video : మోటార్‌సైకిల్‌పై ప్రేమికుల విచిత్ర సంఘటన, రూ. 21 వేలు చలాన్ ( వీడియో వైరల్)
స్దానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వుండాలని సూచించారు. నేరాల నివారణ చర్యలలో భాగంగా స్దానిక ప్రాంతాలలో ప్రజలు స్వచ్ఛందంగా కూడళ్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని, బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని,ఏ బ్యాంక్ సిబ్బంది అయిన కార్డ్ నంబర్, పిన్, ఓటిపి, సివివి వివరాలను ఎప్పుడూ వారు అడిగే అవకాశం లేదని వివరించారు.
ఒకవేళ ఎవరైనా అడిగితే వారు సైబర్ నేరగాళ్లని గుర్తించాలని అన్నారు. బ్యాంక్ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్స్ ఇస్తామంటే అనుమానించాలన్నారు. అనుమతి లేని ప్రవేటు చీట్స్ ఫండ్స్ లో చేరి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. ఎలాంటి అత్యవసర సమయంలో అయిన డయల్ వంద నంబర్ కు లేదా స్దానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు యాట సైదులు,సతీష్ వర్మ,ట్రాఫిక్ ఎస్ ఐ రవీందర్ నాయక్,ఏఎస్ఐ కుశలవ్,శంకర్ యాభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..










