TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?
TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?
మనసాక్షి , వెబ్ డెస్క్ :
టీఎస్పీఎస్సీ తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న అడిగారు. బలగం సినిమా దర్శకుడు, నిర్మాత , సంగీత దర్శకుడు , కొమరయ్య పాత్ర గురించి ఆప్షన్స్ ఇచ్చి వాటిని జత చేయాలంటూ ప్రశ్న అడిగారు.
కాగా బలగం సినిమాపై వచ్చిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బలగం సినిమాపై పోటీ పరీక్షలో అడగటం ఇది తొలిసారి ఏమీ కాదు. గతంలో కూడా కానిస్టేబుల్ పరీక్షలో కూడా బలగం సినిమాపై ప్రశ్న అడిగారు. 2023 ఒనికో ఫిలిమ్స్ అవార్డులో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది. అనే ప్రశ్న అడిగారు. అప్పుడు దాని గురించి దర్శకుడు వేణు వెల్దండి ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశాడు.
ALSO READ :
3. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
4. PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!
బలగం సినిమా తెలంగాణలోని ప్రతి మనసును తాకిన సినిమా.. తెలంగాణ పల్లెల్లో ఈ సినిమా ప్రదర్శించబడింది. సినిమా థియేటర్లతో పాటు ఓటీపీ లో కూడా చాలా హిట్ అయింది. ఊరు ఊరంతా కలిసి కన్నీళ్లు పెట్టుకున్న సినిమాగా గుర్తింపు వచ్చింది. కాగా గ్రూప్ – 4 పరీక్షలో వచ్చిన ప్రశ్న ట్విట్టర్‌లో వైరల్ అవుతుంది.
https://twitter.com/YashwanthUredi/status/1675056834372337667?t=YBcsewt42Sh49zje637WjQ&s=19









