Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
మనసాక్షి: వెబ్ డెస్క్ :
ఈ ఏడాది రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ పై సందిగ్ధత ఏర్పడింది. రాఖీ పౌర్ణమి ఎప్పుడు నిర్వహించుకోవాలనే విషయంపై తర్జనభజనలు జరుగుతున్నాయి. కొంతమంది 30వ తేదీన, మరికొంతమంది 31వ తేదీన రక్షాబంధన్ నిర్వహించుకోవాలని అంటున్నారు. అది ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..
శ్రావణమాసం శుక్లపక్ష పౌర్ణమి తేదీని రాఖీ పౌర్ణమి అంటారు. ఇది ప్రతిఏటా శ్రావణమాసంలోనే వస్తుంది. రాఖీ పౌర్ణమి రోజునే రక్షి రక్షాబంధన్ అని కూడా అంటారు. శ్రావణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ ఏడాది 2023 లో శ్రావణ పూర్ణిమ ఆగస్టు 30 లేదా 31 రోజు తేదీ ఏరోజు సరైనదో తెలుసుకుందాం…
అయితే ఈ రోజున భద్ర పూర్ణిమ తిధితోపాటు భద్ర కూడా జరుగుతుంది. అదేంటో తెలుసుకుందాం… రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల ప్రేమకు చిహ్నం. ఈ రోజున సోదరీమణులు వారి సోదరులకు రక్ష సూత్రాన్ని కట్టి వారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ఉండాలని కోరుకుంటారు.
అయితే ఈరోజు రాఖీ కొనే సమయంలో సోదరీమణులు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రక్షాబంధన్ ను శుభసమయంలో చేయటం ప్రయోజనం. మార్కెట్లో రంగురంగుల రాఖీలు దర్శనమిస్తుంటాయి. కానీ రాఖీ కట్టేటప్పుడు అక్కాచెల్లెళ్లు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. సోదరుల మనికట్టుకు ఎలాంటి రాఖీ కట్టాలో తెలుసుకుందాం..
విభిన్నమైన డిజైన్లలో రాఖీలతో మార్కెట్లు నిండిపోయాయి ఇలాంటి పరిస్థితులలో సోదరీమణులు వారి సోదరులకు రాఖీ కట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆ సమయంలో ఎలాంటి అశుభ ఘడియలు ఉండకూడదు. సాధారణంగా ఇలాంటి రాఖీలు పిల్లలు కడతారు. రంగురంగుల రాఖీలు చూడగానే ఆకర్షించే విధంగా ఉంటాయి. అవి శుభప్రదం కాదు.
శ్రావణ పూర్ణిమ తిధి 2023 కాశి జ్యోతిష నిపుణుల పంచాంగం ప్రకారం పూర్ణిమ తిధి ఆగస్టు 30 ఉదయం 10:58 గంటలకు ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు అంటే 2023 ఆగస్టు 31 ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. కానీ ఈసారి బద్రునీడ కమ్ముతుంటుంది. ఆ సమయంలో రాఖి కట్టకూడదు. ఈసారి ఇది ఉదయం 10:58 గంటల నుంచి 9.01 గంటల వరకు ఉంటుంది.
మరి రాఖీ కట్టుకోవడానికి సరైన సమయం 30వ తేదీ రాత్రి 9.01 గంటల నుంచి మరుసటి రోజు 31 ఉదయం 7.05 గంటల వరకు కట్టుకోవచ్చును.
MOST READ :
- Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
- How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
- నల్లగొండ : సింగిల్ ఇన్వెస్ట్.. డబుల్ ప్రాఫిట్, రియల్ వ్యాపారం మాటున ఘరానా మోసం..!
భద్ర కాలంలో రాఖీ కడితే ఏమవుతుంది?
భద్రకాలం అని ఎందుకు పిలుస్తారు..? ఈ సమయంలో రాఖీ కడితే ఏమవుతుంది..? అనే విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది. భద్రకాలంలో రావణునికి ఆయన సోదరి సూర్పనఖ రాఖీ కట్టింది. రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి కూడా ఈ భద్రకాలంలో రాఖీ కట్టడమే కారణమని నమ్మకం. రక్షాబంధన్ సందర్భంగా భద్ర కాలంలో లంకేశ్వరుడుని తన సోదరి రాఖి కట్టడం వల్ల లంకకు చెడుదశ ప్రారంభమైంది. రావణుడికి దురదృష్టం మొదలైందని చెబుతారు.
అంతేకాకుండా శ్రావణ పర్వదినం శ్రావణ పూర్ణిమ రోజున ఉదయం శ్రావణ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున బ్రాహ్మణులు తమ పాత యాజోపవీత్ అంటే జంజం మార్చుకుంటారు. కొత్తదారం ధరిస్తారు. ఇది ఉదయాన్నే చేస్తారు. ఈ కథనం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిపై మన సాక్షి ధ్రువీకరించలేదు. కచ్చితంగా ఇదే వాస్తవం అని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. గమనించగలరు.
ALSO READ :










