Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయం

గతుకుల రోడ్డుపై వరి నాట్లు.. యువజన కాంగ్రెస్ వినూత్న నిరసన..!

గతుకుల రోడ్డుపై వరి నాట్లు.. యువజన కాంగ్రెస్ వినూత్న నిరసన..!

చౌటుప్పల్ . మన సాక్షి:

చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని జాతీయ రహదారి పక్కన ఉన్న బస్టాండ్ ఆవరణలో ఏర్పడిన గుంతలలో నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న కారణంగా యువజన కాంగ్రెస్ నాయకులు వినూత్న నిరసన ప్రదర్శించారు.

 

చౌటుప్పల్ మున్సిపాలిటీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు రాంబాబు ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో ఏర్పడిన గుంతలలో యువజన కాంగ్రెస్ నాయకులు మంగళవారం వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీ స్మార్ట్ పట్టణంగా చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు నాయకులు పట్టించుకోలేదని ,జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్లు అద్వానంగా ఏర్పడి వర్షాలు కురిసినప్పుడు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని అన్నారు.

 

ALSO READ :

  1. Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
  2. Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
  3. RTC : ఆర్ టి సి కార్మికుల విలీనం- ఆంధ్రప్రదేశ్ అనుభవాలు.. పుస్తకం ఆవిష్కరణ..!
  4. Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
  5. NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?

 

వర్షాలు పడ్డప్పుడు రోడ్డుపై ఉన్న గుంతల్లో నీరు చేరి బురద మయంగా చేరి బస్టాండ్ లోనికి రాకపోకలకు, ప్రయాణికులకు, బాటసారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వాటిని పూడ్చివేయాలని అన్నారు.

 

అలాగే మునుగోడు బై ఎలక్షన్లో చౌటుప్పల్ కు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తారని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం కేవలం బి ఆర్ ఎస్ నాయకులకు మాత్రమే ఇచ్చారని అర్హులైన నిరుపేదలకు ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పస్తం మల్లేష్, మామిళ్ళ ఉపేందర్ ,దీప అభి, రుద్ర శ్రావణ్ ,జెల సాయి తదితరులు పాల్గొన్నారు.

 

MOST READ :

  1. Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
  2. Suryapet : సూర్యాపేటలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.. పోటా పోటీగా ధర్నాలు..!
  3. కల్వకుర్తి : బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎంపిక పట్ల అసంతృప్తి.. ఏకపక్ష నిర్ణయంతో పార్టీకి నష్టం..!

మరిన్ని వార్తలు