కల్వకుర్తి : బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎంపిక పట్ల అసంతృప్తి.. ఏకపక్ష నిర్ణయంతో పార్టీకి నష్టం..!
కల్వకుర్తి : బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎంపిక పట్ల అసంతృప్తి.. ఏకపక్ష నిర్ణయంతో పార్టీకి నష్టం..!
నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్
రంగారెడ్డి జిల్లా మాడ్గుల ప్రతినిధి , మన సాక్షి.
కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని నాగర్ కర్నూల్ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ అన్నారు. మాడ్గులలో శనివారం బాలాజీసింగ్ తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కల్వకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థిగా జైపాల్ యాదవ్ ను ఎంపిక చేసే విషయంలో పార్టీ అధిష్టానం ఎవరితో సంప్రదింపులు చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు.
ALSO READ :
- Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
- How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!
- Ponguleti : పొంగులేటి మూడు చోట్ల నుంచి దరఖాస్తులు.. ఎందుకో తెలుసా..!
- Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
- భయంతోనే ఆయనకు మంత్రి పదవి : రేవంత్ రెడ్డి
- మిర్యాలగూడ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్..!
- Allu Arjun : తగ్గేదేలే.. సుకుమార్ ని పట్టుకుని ఏడ్చిన బన్నీ .. ! (వీడియో వైరల్)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా అధిష్టానం అభ్యర్థిని ఎంపిక చేయడంతో అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభీష్ట మేరకు కార్యకర్తలు, నాయకుల కోరిక మేరకు అధిష్టానం మరొకసారి పునరాలోచించి అభ్యర్థిని ఎంపిక చేయాలని బాలాజీసింగ్ అన్నారు.
అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం పునరాలోచించి నిర్ణయం తీసుకోకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవడంమే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థులు ఓడిపోయే ప్రమాదం ఉంటుందని బాలాజీ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ రైతు సమితి అధ్యక్షులు పగడాల రవి. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సూదిని. కొండల్ రెడ్డి, సూదిని శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మిద్దె రాములు. మాజీ ఎంపీటీసీ సభ్యులు ముదెంటి దేవయ్య, నాయకులు మస్న విష్ణు, పల్లె జంగయ్య, చంద్రయ్య, అచ్చయ్య, ఆరోగ్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.









