Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Very Sad : రాఖీ పౌర్ణమి రోజే ఎంతటి విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు..!

Very Sad : రాఖీ పౌర్ణమి రోజే ఎంతటి విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు..!

పెద్దపల్లి, మన సాక్షి :

రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్లకు , అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక.. అలాంటి రాఖీ పౌర్ణమి రోజే అప్పటివరకు చెల్లెలితో ఆనందంగా గడిపిన అన్నయ్య. అదే రాఖి ఆఖరి రాఖీ అవుతుందని ఆ చెల్లెలు ఊహించలేదు.

 

వివరాల ప్రకారం .. అన్న చెల్లెలు అక్క తమ్ముళ్లకు అనుబంధానికి ప్రతికైనా రాఖీ పౌర్ణమి ఆడపడుచులు తమ పుట్టింటికి ఆనందంగా వెళుతుంటారు. అయితే ఓ విషాద సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అత్యంత విషాదకరంగా అన్న మృతదేహానికి చెల్లెలు రాఖీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

 

ALSO READ :

  1. WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!
  2. TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!
  3. Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
  4. Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!

 

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. అప్పటిదాకా చెల్లెలితో సంతోషంగా గడిపిన కనకయ్య ఒకసారిగా గుండెపోటుతో తీవ్రస్వస్థతకు గురయ్యాడు.

 

ఆ క్షణాల్లోనే కనకయ్య ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఎంతో సంతోషంగా ఆయన పుట్టింటికి వచ్చిన చెల్లెకు విషాద సంఘటన ఎదురైంది. రాఖీ కట్టేందుకు ఇంటికి వచ్చిన చెల్లెలు అన్న మృతదేహానికి రాఖీ కట్టాల్సి వచ్చింది. ఆ ఇద్దరి అనుబంధాన్ని చూసిన ఊరంతా కన్నీటి పర్యంతమైంది.

మరిన్ని వార్తలు