Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ :  పారదర్శకంగా ఓటర్ల జాబితా..!

మిర్యాలగూడ :  పారదర్శకంగా ఓటర్ల జాబితా..!

మిర్యాలగూడ ఆర్టీవో చెన్నయ్య

మిర్యాలగూడ  , మన సాక్షి :

ఓటర్ల జాబితా పారదర్శకంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య పేర్కొన్నారు. బుధవారం మిర్యాలగూడలోని ఆర్డీవో కార్యాలయంలో ఓటరు జాబితా సంక్షిప్త సవరణ లో భాగంగా ఓటరు నమోదు అధికారి, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం గుర్తింపు పొందిన అన్ని జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధులతో వారాంతపు సమావేశం నిర్వహించడం జరిగినది.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం అన్నీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశములో హాజరయినటువంటి ప్రతినిధులకు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల జాబితా ఇవ్వడం జరిగినది.

 

ఓటరు జాబితా పారదర్శకంగా తయారు చేయుటలో భాగంగా ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులకు వచ్చినటువంటి దరఖాస్తుల జాబితా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈనెల 26, 27లో నిర్వహించిన Special Campaign Daysలో ఫారం-6 (1162), ఫారం-7(251), ఫారం-8(219) మొత్తం 1632 దరఖాస్తులు స్వీకరించడం జరిగినది తెలిపారు.

 

ALSO READ : 

  1. Road Accident : రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం.. అంతా ఓకే కుటుంబానికి చెందినవారు..!
  2. BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు..!
  3. TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!
  4. WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!
  5. Very Sad : రాఖీ పౌర్ణమి రోజే ఎంతటి విషాదం.. అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు..!

 

అదే విధంగా సెప్టెంబర్ 2 మరియు సెప్టెంబర్ 3వ తేదీలలో కూడా బూత్ స్థాయి అధికారులు అందరూ కూడా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని, అక్టోబర్ ఒకటవ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సినదిగా తెలపడం జరిగినది.

 

ప్రజలలో అవగాహన కోసం పత్రికల ద్వారా, మున్సిపల్ మరియు గ్రామ పంచాయితీ ట్రాక్టర్ల ద్వారా వాయిస్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. రాజకీయ పార్టీల ప్రతినిధులందరినీ కూడా తమ పార్టీ తరపున బూత్ స్థాయి ఏజెంట్లను నియమించమని కోరడం జరిగినది.

 

సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సలీం , సిపిఎం నాయకులు వీర్లపల్లి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు మట్టపల్లి సైదయ్య యాదవ్ ,ఆప్ నాయకులు కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు