Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : మంత్రి తో ఉన్న దండుపాళ్యం బ్యాచ్ పై విచారణ జరపాలి

Suryapet : మంత్రి తో ఉన్న దండుపాళ్యం బ్యాచ్ పై విచారణ జరపాలి

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు

సూర్యాపేట , మనసాక్షి :

సూర్యాపేటలో భారత రాజ్యాంగం నడవడం లేదని జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాజ్యాంగ నడుస్తుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

 

2014 ముందు కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉన్న దండుపాళ్యం బ్యాచ్ వ్యక్తులే ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి పక్కన ఉండి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కానీ వారందరినీ ప్రోత్సహిస్తూ,ఇప్పుడు ఒక బీసీ బిడ్డ రాజకీయ వాటా అడిగినందుకు డీసీఎంఎస్ చైర్మన్ ఒట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు పెట్టించి, నాన ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత తొమ్మిది సంవత్సరాల క్రితం నీ పక్కన జానయ్యని కూర్చోబెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యే టికెట్ అడిగినందుకు కేసులు బనాయిస్తున్నారని అన్నారు.

 

అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డి పక్కన ఉండే అనేకమంది రాజకీయ నాయకులు అక్రమాలు చేసిన వాళ్లపై ఎందుకు కేసులు పెట్టించలేదు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.కుడ కుడ గుట్టను తవ్వి తన కొడుకు స్మారకార్థం పేరుతో ప్రభుత్వ భూమి కోట్ల విలువ చేసే భూమిని 10 కుంటలు ఆక్రమించి ఇల్లు నిర్మించారని . ప్రభుత్వ భూమి మరో నాయకుడు ఉర్లుగొండలో 8 ఎకరాల భూమిని ఆక్రమించాడని, ఇంకొకడు మూసి కెనాల్ ఆక్రమించి వెంచర్ కోసం ఎంపీ నిధుల నుండి రోడ్డు వేయించారని తెలిపారు.

 

ALSO READ : 

  1. Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!
  2. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  3. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
  4. SONIYA : సోనియాతో ముగిసిన షర్మిల భేటీ.. తెలంగాణకా.. ఏపీకా..?

 

ప్రభుత్వ భూములు ఆక్రమించి గుట్టల సైతం తవ్వి కనుమరుగయ్యే విధంగా ఆక్రమించారని, చివ్వెంల మండలంలో మరో నాయకుడు చేసే అరాచకాలు,భూ అక్రమాల గురించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. వీరందరూ కోట్ల రూపాయల ఆస్తులు ఆక్రమించుకుంటే వారిపై చర్యలు శూన్యము కానీ ఒక బీసీ నాయకుడు రాజకీయంగా ప్రశ్నించినందుకు తొక్కినారా తీస్తా అనడం ఎంతవరకు సమంజసం అని, మంత్రి పక్కన ఉన్న అనేకమంది అవినీతిపరులపై తొక్కినారు తీయాలి అని డిమాండ్ చేశారు.

 

సంకినేని వెంకటేశ్వర్ రావు అవినీతికి వ్యతిరేకం మాత్రమే అని తెలిపారు. త్వరలోనే దండుపాల్యం ముఠా లేక పంపుతానని వారందరిపై చర్యలు తీసుకొని ఎస్పీ, కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలు దండుపాళ్యం చేసే అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలి తప్ప రాజకీయంగా వాటా అడిగిన వ్యక్తులపై కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సలిగంటి వీరేందర్, చలమల్ల నరసింహ, కర్నాటి కిషన్,గజ్జల వెంకటరెడ్డి,అరూరు శివ, పందిరి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు