వట్టే జానయ్య యాదవ్ పై కుట్రలు మానుకోవాలి
వట్టే జానయ్య యాదవ్ పై కుట్రలు మానుకోవాలి
సూర్యాపేట రూరల్ , మనసాక్షి
నల్లగొండ జిల్లా డిసీ ఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై మంత్రి జగదీష్ రెడ్డి కుట్రలు మానుకోవాలని గురువారం వట్టే జానయ్య యాదవ్ నివాసం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా యాదవ సంఘం నాయకులు మూడుముంతల నాగరాజు అన్నారు.
మంత్రి నిరంకుశంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొని జానయ్య యాదవ్ పై అక్రమంగా పెట్టిన ఎత్తివేయాలి జానయ్య యాదవ్ ఆయన కుటుంబ సభ్యులపై వేధింపులే కాకుండా మద్దతు ఇచ్చిన వాళ్లను కూడా వేధించడం కేసులు నమోదు చేయడం సరికాదన్నారు.
ఈ విషయంలో బహుజనులంతా ఏకమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో యాదవ సంఘం నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మూడుముంతల నాగరాజు, అధ్యక్షులు బారి మల్సూర్ యాదవ్, కోడిలింగయ్య యాదవ్ , యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ALSO READ :









