Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

రాబోయే ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం..!

రాబోయే ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం..!

ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేళ్లచెరువు, ఆగస్ట్ 31,మనసాక్షి:

రాబోయే ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ అధికారంలో రాబోతోందని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మేళ్లచెరువు మండలం లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు‌.

 

ఈ ప్రభుత్వంపై ప్రజలు విసిగెత్తారని,ఇంటికి సాగనంపడానికి సిద్దంగా ఉన్నారని ఉత్తమ్ అన్నారు. కాంగ్రెస్ గెలిచిన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చిందని అన్నారు.కానీ ఇక్కడ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో చాలా హామీలని ఇప్పటికీ నెరవేర్చలేదని గుర్తు చేశారు.

 

ALSO READ : 

  1. జగదీష్ రెడ్డి ఆస్తుల పై ఈ డి విచారణ జరిపించాలి
  2. వట్టే జానయ్య యాదవ్ పై కుట్రలు మానుకోవాలి
  3. Suryapet : మంత్రి తో ఉన్న దండుపాళ్యం బ్యాచ్ పై విచారణ జరపాలి
  4. Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!
  5. SONIYA : సోనియాతో ముగిసిన షర్మిల భేటీ.. తెలంగాణకా.. ఏపీకా..?

 

ఇక్కడి ఎమ్మెల్యే సైదిరెడ్డి అరాచకాలు హద్దులు దాటాయని ఆరోపించారు. ఎమ్మెల్యే దోపిడీ,అక్రమాలపై సమగ్ర చిట్టా రూపొందిస్తున్నామని దోపిడీకి గురైన వారు వివరాలను తమకు చెప్పాలని అన్నారు.ఆ చిట్టాను ప్రజల ముందు ఉంచి ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్ నాయకులు ద్వంద వైఖరి అవలంబించవద్దని సూచించారు.

 

కోదాడ హుజూర్‌నగర్ లలో 50 వేల మెజార్టీతో తాను,తన సతీమణి గెలవబోతున్నామని,మెజార్టీ తగ్గితే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు.ఎన్నికల యుద్దం మొదలైందని, కాంగ్రెస్ సైనికులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి,సైదేశ్వర్ రావు,రామచందర్ రావు,గోవిందరెడ్డి,బిక్షం,శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు