Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ఏడు నెలల గర్భిణి అనుమానస్పద మృతి..!

ఏడు నెలల గర్భిణి అనుమానస్పద మృతి..!

మర్రిగూడ , మన సాక్షి ;
మర్రిగూడ మండలంలోని అజిలాపురం గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి అనుమానస్పద మృతి ఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వివరాల ప్రకారం .. మండలంలోని కమ్మగూడెం గ్రామానికి చెందిన టేకుల సారమ్మకు ముగ్గురు సంతానం.

రెండవ కూతురు బాల సుస్మిత (18) అజిలాపురం గ్రామానికి చెందిన వడిత్య శ్రీకాంత్ ప్రేమించి ఈ ఏడాది జనవరి లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సుస్మిత ఏడు నెలల గర్భవతి కాగా. ఆదివారం సాయంత్రం భార్యాభర్తలకు ఘర్షణ జరిగింది. దీంతో సుస్మిత అకస్మాత్తుగా కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు సమాచారం.

ALSO READ :

  1. Civil supply : గోదాములు తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు.. యూరియా కొరత సృష్టిస్తే చర్యలు..!
  2. SURYAPET : పేగు బంధాన్ని కంప చెట్లలో పడేసిన కసాయి తల్లి..!
  3. BREAKING : పాతపట్నం లో ఉద్రిక్తత

వెంటనే శ్రీకాంత్ అత్త సారమ్మకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. మృతురాలి అక్క సుష్మ ఇచ్చిన ఫిర్యాదుతో మర్రిగూడ ఎస్ఐ రంగారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అజిలాపురానికి చెందిన శ్రీకాంత్.  కమ్మ గూడెం కి చెందిన సుస్మిత వీరిద్దరూ 8 నెలల క్రితం కులాంతర  ప్రేమ వివాహం చేసుకున్నారు.  అమ్మాయి ఏడు నెలల గర్భవతి . పోలీసులు  శ్రీకాంత్   కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించినారు.  మహిళా బాడీని పోస్టుమార్టం నిమిత్తం  దేవరకొండకు తరలించారు

మరిన్ని వార్తలు