సూర్యాపేట : రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి..!
సూర్యాపేట : రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన సూర్యాపేట మండల పరిధిలోని అరకరం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అర్వపల్లి మండలం వర్ధమాన్ కోట గ్రామానికి చెందిన సైదిరెడ్డి మల్లారెడ్డి (55) ఉక్కు వెంకన్నలు అర్వపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు.
వీరిద్దరూ సూర్యాపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు రోజువారీగా ఒకే ద్విచక్ర వాహనంపై అర్వపల్లి లోని పాఠశాలకు వెళ్లి విధులకు హాజరై తిరిగి సూర్యాపేటకు వస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాల నుంచి సూర్యాపేటకు సాయంత్రం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు .
ALSO READ :
సూర్యాపేట జనగాం రహదారిపై యర్కారం గ్రామం సమీపంలోనీ రేఖ్యా నాయక్ తండ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఉపాధ్యాయులు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది దీంతో ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన ఉపాధ్యాయులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మల్లారెడ్డి మృతి చెందారు. వెంకన్న పరిస్థితి కూడా విషమంగా ఉంది ఈ విషయమై ఇంకా పోలీస్ కేసు నమోదు కాలేదు.
ALSO READ :









