Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : పెట్రోల్ బంకుల్లో సివిల్ సప్లై అధికారులు నామమాత్రపు తనిఖీలు

మిర్యాలగూడ : పెట్రోల్ బంకుల్లో సివిల్ సప్లై అధికారులు నామమాత్రపు తనిఖీలు

మిర్యాలగూడ,  మన సాక్షి :

సివిల్ సప్లై అధికారులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని పెట్రోల్ బంకులలో నామమాత్రపు తనిఖీలు మంగళవారం నిర్వహించారు. పెట్రోల్ బంకులలో కనీస సౌకర్యాలు కూడా లేనప్పటికీ వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడంతో పాటు వారిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు.

పెట్రోల్ బంకులలో వాహనాలకు ఉచితంగా హెయిర్ పెట్టాల్సి ఉన్నప్పటికీ పెట్టడం లేదు. అంతేకాకుండా మంచినీటి సౌకర్యం , మూత్రశాలల సౌకర్యం కూడా లేకుండా ఉన్నాయి. అయినా కూడా సివిల్ సప్లై అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ALSO READ : Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !

మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ ఐఓసీఎల్, దామరచర్ల మండల కేంద్రంలో ఉన్న పెట్రోల్ బంకులను సివిల్ సప్లై అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేల్స్, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ జావేద్ మాట్లాడుతూ పెట్రోల్ బంకులను తప్పనిసరిగా మాలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, ఎయిర్ మిషిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోజువారి పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను కచ్చితంగా పాటించాలని కోరారు.

ALSO READ : Modi : తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. !

సివిల్ సప్లై కమిషనర్, డిసిఎస్ఓ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో ఐఓసీఎల్ సేల్స్ అధికార శైక్ మొగల్ వలి , సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్ సింగ్ తదితరులు ఉన్నారు.

రేషన్ దుకాణాలు తెరిచి ఉంచకపోయినా చర్యలు శూన్యం : 

రేషన్ దుకాణాలు మిర్యాలగూడ పట్టణంలో ఏ సమయంలో తెరుస్తున్నారో.? ఏ సమయంలో మూసివేస్తున్నారో..? కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం రేషన్ దుకాణాలలో ప్రతి ఒక్కరు ఈ కేవైసీ కోసం వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంది. కాగా రేషన్ దుకాణాలు సరైన సమయంలో తెరవకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సివిల్ సప్లై అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వదిలేస్తున్నారని సమాచారం.

ALSO READ : CRIME NEWS : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి భర్తే కాలయముడు.. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!

మరిన్ని వార్తలు