మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూత..!
మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూత..!
మృతి పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం
జగిత్యాల/ పరిగి, మనసాక్షి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యుటీ స్పీకర్ , వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తండ్రి , పరిగి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్ను ముశారు. గత కొద్ది రోజులుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.
హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పరిగి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014లో బీఆర్ఎస్ లో చేరారు. హరీశ్వరరెడ్డి కుమారుడు మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హరీశ్వర్ రెడ్డిమృతి పట్ల రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!









