తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లి.. క్యులైన్ లో భక్తుడు మృతి,,!
తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లి.. క్యులైన్ లో భక్తుడు మృతి,,!
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 24 మనసాక్షి:
తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శనం కోసం వెళ్ళి వరుసలో నిలబడి గుండె పోటు తో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా కేంద్రం లోని బాహర్ పేట వీధికి చెందిన నర్సిములు ( 60) కుటుంబ సభ్యులతో తిరుపతి కి బయలుదేరారు.
తిరుమల కు చేరుకుని ఆదివారం ఉదయం 7 గంటల సమయంలొ క్యులైన్ లొనే గుండెపోటు తో నర్సప్ప మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు నర్సీపట్నం నారాయణపేట ఎక్షైజ్ కార్యాలయంలో తాత్కాలిక పద్దతిన పనిచేస్తున్నాడు.
ALSO REAFD : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!
ఎక్షైజ్ ఆఫీస్ లో 25 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మృతుడికి భార్య గోవిందమ్మ , ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ విషయం తెలిసిన వార్డ్ కౌన్సిలర్ బసపురం వెంకట్రములు హుటాహుటిన ప్రత్యేక వాహనం లో తిరుపతి కి బయలు దేరారు.
ALSOTs Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..! READ :









