Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణసినిమా

Bigg Boss : బిగ్ బాస్ హిస్టరీ లోనే తొలిసారిగా.. మరోసారి మినీ గ్రాండ్ ఎంట్రీ.. ఎవరెవరు వస్తున్నారంటే..!

Bigg Boss : బిగ్ బాస్ హిస్టరీ లోనే తొలిసారిగా.. మరోసారి మినీ గ్రాండ్ ఎంట్రీ.. ఎవరెవరు వస్తున్నారంటే..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో.. ఇప్పుడు ఏడవ సీజన్ కొనసాగుతుంది. తెలుగు వారిలో అత్యధికంగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ షో అయితే బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరోసారి మినీ గ్రాండ్ లాంచ్ జరగనున్నది. బిగ్ బాస్ – 7 సెప్టెంబర్ మూడో తేదీన తెలుగులో ప్రారంభమై 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు . వారిలో మూడు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని ముగ్గురు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. కాగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 11 మంది కంటెస్టెంట్ మాత్రమే ఉన్నారు.

ఎవరా 11 మంది :

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 11 మందిలో శివాజీ, ఆట సందీప్, శోభ శెట్టి ఈ ముగ్గురు పవరాస్త్రాలను సాధించి పర్మినెంట్ హౌస్ మేట్స్ అయ్యారు. ఇప్పుడు నాలుగో పవరాస్త్రా కోసం టాస్క్ జరుగుతుంది. దానికోసం అమర్దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, రాతిక రోజ్, పల్లవి ప్రశాంత్ , శుభశ్రీ , ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్ పోటీపడుతున్నారు.

అక్టోబర్ 8న మినీ గ్రాండ్ లాంచ్ :

సెప్టెంబర్ 3వ తేదీన బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ లాంచ్ అయిన విషయం తెలిసిందే. కాగా అక్టోబర్ 8న లేదా 9వ తేదీన బిగ్ బాస్ 7 తెలుగు మినీ గ్రాండ్ లాంచ్ ఉండబోతుందని సమాచారం. ఈ గ్రాండ్ లాంచ్ తో మరో 6 లేదా 7 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వానున్నట్లు తెలిసింది. ఈ ఎంట్రీ తో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 2.0 స్టార్ట్ కానున్నది.

ALSO READ : Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!

న్యూ కంటెస్టెంట్స్ :

బిగ్ బాస్ 7 సీజన్ లో మినీ గ్రాండ్ లాంచ్ లో భాగంగా కొత్త కంటెస్టెంట్స్ ఎవరంటే యూట్యూబర్ నిఖిల్, సీరియల్ హీరో అర్జున్ అంబటి , గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ పూజ మూర్తి, భార్య భర్తలు అంజలి – పవన్, సింగర్ బోలే అడుగు పెడతారని తెలిసింది. వీళ్ళతోపాటు ఇటీవల హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ దామిని కూడా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ 7 సీజన్ సరి కొత్తగా ప్రారంభిస్తారట. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాళ్లు నాలుగో పవరాస్త్రా కోసం పోటీపడుతున్నారు. ఐదో పవరాస్త్రా గెలుచుకున్న కంటెస్టెంట్ తర్వాత ఈ మినీ గ్రాండ్ లాంచ్ జరుగుతుందని సమాచారం. ఐదు వారాలలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఒకరికి రీఎంట్రీ ఇవ్వనున్నారట. బిగ్ బాస్ రీ ఎంట్రీ ఇచ్చేది మరి సింగర్ దామినినా.. ఇంకెవరైనా అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సెవెన్ ఉల్టా పల్టా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు