Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Ys Sharmila : మిర్యాలగూడ నుంచి షర్మిల పోటీ..!

Ys Sharmila : మిర్యాలగూడ నుంచి షర్మిల పోటీ..!

హైదరాబాద్ , మన సాక్షి :

రాబోయే ఎన్నికల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పోటీ చేయడానికి సిద్ధమయ్యారు . రెండు రోజులపాటు హైదరాబాదులోని లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశాలలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఆమె మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సుమారు నాలుగు నెలల పాటు చర్చలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా షర్మిల భేటి అయ్యారు. కాగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల విలీన ప్రతిపాదనను పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు .

ALSO READ : Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!

దాంతో విలీన ప్రతిపాదన సాధ్యం కాలేదు. కాగా ఈనెల 12, 13 వ తేదీలలో హైదరాబాదులోని లోటస్ పాండ్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానంతరం పాలేరు తో పాటు మరో నియోజకవర్గంలో తాను పోటీ చేయనున్నట్లు షర్మిల ప్రకటించారు.

తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీలో ఉంటుందని ఆమె తెలిపారు. ఆమె పోటీ చేసే రెండవ నియోజకవర్గమైన మిర్యాలగూడలోనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ALSO READ : అనారోగ్యానికి గురైన విద్యార్థిని.. టిసి ఇచ్చి బయటకి పంపిన గురుకుల ప్రిన్సిపల్..!

కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీల పొత్తు ఉంటుందని మిర్యాలగూడ నియోజకవర్గాన్ని సిపిఎం కు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో ఉండే అవకాశాలు లేవు. కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో లేకపోవడం వల్ల ఆ పార్టీ శ్రేణులు కొంత నైరాశము చెందే అవకాశాలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పై వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో లేకపోవడం.. తమకు కలిసొస్తాయని వైయస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఈ మేరకు వైఎస్ షర్మిలమ్మ మిర్యాలగూడ నుంచి పోటీ చేసి భాస్కరరావు వ్యతిరేక ఓటు తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తమ వైపు తిప్పుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తున్నందున కొంత మేరకు పార్టీ ప్రాబల్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిసింది.

ALSO READ : Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!

ఏది ఏమైనా మిర్యాలగూడ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లతోపాటు బీఆర్ఎస్ వ్యతిరేక, కాంగ్రెస్ అనుకూల ఓటర్లను తమ వైపు తిప్పుకొని గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా మరో రెండు రోజుల్లో వైయస్ షర్మిల ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు