Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

నల్గొండ : మాడుగులపల్లి నుంచి సినీ ఫక్కిలో పరార్.. వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద కోట్ల కొద్ది కట్టల పట్టివేత..!

నల్గొండ : మాడుగులపల్లి నుంచి సినీ ఫక్కిలో పరార్.. వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద కోట్ల కొద్ది కట్టల పట్టివేత..!

-వాడపల్లిలో రూ.3.04 కోట్లు, (18 లక్షల) విలువ గల ఒక కియా కార్ సీజ్
సరిహద్దుల్లో పక్కగా ఎలక్షన్ డ్యూటీ

నల్లగొండ / మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అంతర్-రాష్ట్ర చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి అడుగడుగునా తనిఖీలు.. క్షణక్షణం అప్రమత్తం గా ఉంటూ ఓటర్లను ప్రభావితం చేసే నగదు,మద్యం,మరియు మాదకద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టడానికి ఈనెల ఆరవ తేదీ నుండి నల్లగొండ జిల్లా నందు మూడు అంతర్-రాష్ట్ర చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేయడం జరిగిందని జిల్లా యస్.పి కె.అపూర్వ రావు తెలిపారు.

దీనిలో బాగంగా ఆదివారం ఉదయం మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద యస్.ఐ సిబ్బంది వాహన తనిఖీలు చేస్తుండగా ఒక తెలుపు రంగు వాహనం ఆపకుండా వెళ్ళగా ఇదే విషయాన్ని మాడుగులపల్లి పోలీసులు రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న మిర్యాలగూడ డియస్పీ అప్రమత్తం చేశారు. మిర్యాలగూడ డియస్పి ట్టు టౌన్ ఇన్స్పెక్టర్ నరసింహ అప్రమత్తం చేయగా ఆయన ఈదులుగూడ సిగ్నల్‌ వద్ద కారునుఆపడానికి ప్రయత్నిచగా సదరు వెహికిల్ ఆపకుండా వెళ్ళగా వాడపల్లిలోని అంతర్రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును మళ్లీ అప్రమత్తం చేశారు.

ALSO READ : C Whistle : అక్రమాలపై ఫిర్యాదులకు సీ-విజిల్‌ యాప్‌.. వంద నిమిషాల్లోనే పరిష్కారం..!

అక్కడ ఎస్‌ఐలు రవికుమార్‌, క్రాంతికుమార్‌ బృందాలు బారికేడ్‌లు వేసి వాహనాన్ని ఆపి తనికి చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారిని విచారించి వాహనాన్ని తనికి చేయగా వాహనంలో ని సీట్ క్రింది బాగంలో రహస్య గదులు తయారు చేసుకొని అందులో మూడు కోట్ల నాలుగు లక్షల రూపాయలు అక్రమంగా డబ్బు దాచినట్లు గుర్తిచడం జరిగింది.
అనుమానితులువిపుల్ కుమార్, అమర్‌సిన్హ్ జాల
ర్యాష్ డ్రైవింగ్ హైవేపై ప్రయాణీకుడికి ప్రమాదం కలిగించడం తనిఖీ చేసే పోలీసు అధికారికి విధేయత చూపకపోవడంవాహనం యొక్క రూపం మార్చి ప్రత్యేకమైన చాంబర్ యేర్పాటు చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అపూర్వ తెలిపారు.

ALSO READ : Kcr Twist : కెసిఆర్ బిగ్ ట్విస్ట్.. బీ ఫామ్ లు వారికేనా, అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..!

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డియస్పీ యై.వెంకటగిరి ఆద్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు నరసింహారావు, సత్యనారాయణ, యస్.ఐ లు రవికుమార్, క్రాంతికుమార్ మరియు సిబ్బందిని జిల్లా యస్పీ గారు అభినందించారు.

శాంతి యుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించు కోవాలి జిల్లా యస్పీ : 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపద్యంలో జిల్లా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్చ గా వియోగించుకొనుటకు ఓటర్లు ఎలాంటి ప్రలోబాలకు గురి చేయకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాము. దీనిలో బాగంగా ఇప్పటి వరకు 2800 మందిని బైండవర్ చేయడం జరిగింది.ఏవరైనా ఎన్నికల కోడ్ ఉల్లగించి శాంతి బద్రతలకు విఘాతం కల్పిస్తే డైయల్ 100 గాని సంబందిత పోలీసు అదికారులకు తెలియ పరచగలరు.

ALSO READ : Congress First List : 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల.. ఇవీ పేర్లు..!

ఎన్నికల కోడ్ నేపద్యంలో జిల్లా పోలీసు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 7.39 కోట్ల నగదు, 40 లక్షల విలువగల మద్యం, 1.71 కోట్ల విలువ గల గంజాయి,80 లక్షల విలువ గల గోల్డ్ పట్టుకోవడమైనది.

మరిన్ని వార్తలు