KTR : ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. ప్రశ్నిస్తే ఎకౌంట్ బ్లాక్.. సోషల్ మీడియాలో వైరల్..!
KTR : ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. ప్రశ్నిస్తే ఎకౌంట్ బ్లాక్.. సోషల్ మీడియాలో వైరల్..!
మన సాక్షి : వెబ్ డెస్క్:
ట్విట్టర్ టిల్లు కేటీఆర్ అంటూ కాంగ్రెస్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఎక్కువ కాలం గడుపుతారని, ఎవరైనా ప్రశ్నిస్తే వారి ఎకౌంట్ ను బ్లాక్ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నవంబర్ 30న ప్రజలు నిన్ను బ్లాక్ చేస్తారు. అప్పుడు నీ పూర్తి సమయం ట్విట్టర్ లో గడుపు అంటూ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పెట్టింది.
కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పేర్కొన్న అంశాలు యదావిధిగా ..
నేరుగా కలవడానికి సమయం ఇవ్వరు. నిరసన ద్వారా తెలియజేద్దామంటే హౌస్ అరెస్టులు చేస్తారు. భారీ కేడ్లు పెట్టి అడ్డుకుంటారు. పోలీసుల సహాయం లేకుండా బయట అడుగు కూడా పెట్టలేరు.
రోజుకు మూడు, నాలుగు గంటలు ట్విట్టర్ గూట్లో పిట్ట కూతలు కూసే ట్విట్టర్ టిల్లు మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తాడు.
దాంతోపాటు నవంబర్ 30న ప్రజలు నిన్ను బ్లాక్ చేస్తారు. అప్పుడు మీ పూర్తి సమయం ట్విట్టర్ లో గడుపుతూ బాగా ఆస్వాదించు అంటూ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అది సోషల్ మీడియా ఫైనల్ గా మారింది.
నేరుగా కలవడానికి సమయం ఇవ్వరు.
నిరసన ద్వారా తెలియజేద్దామంటే..
హౌస్ అరెస్టులు చేస్తారు.
బారికేడ్లు పెట్టి అడ్డుకుంటారు.పోలీసుల సహాయం లేకుండా బయట అడుగు కూడా పెట్టలేరు.
రోజుకు 3,4 గంటలు ట్విట్టర్ గూట్లో పిట్ట కూతలు కూసే… ట్విట్టర్ టిల్లు మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తే బ్లాక్… pic.twitter.com/7UIm9yvKLt
— Telangana Congress (@INCTelangana) October 25, 2023









