Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లాసిద్దిపేట జిల్లా

BIG BREAKING : బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల హెచ్చరిక వాల్ పోస్టర్లు..!

BIG BREAKING : బీఆర్ఎస్ నేతలకు మావోయిస్టుల హెచ్చరిక వాల్ పోస్టర్లు..!

దుబ్బాకలో వెలసిన ” మావోయిస్టుల” పోస్టర్లు

 10 ఏళ్లలో ఏం చేశారు..?

దుబ్బాక, మనసాక్షి :
ఎన్నికల వేళ మావోయిస్టుల లేఖలు జిల్లాలో కలకలం రేపాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి గ్రామ శివారులోని ఎదుల్లా చెరువు వద్దనున్న మత్తడి పిల్లర్లకు వాల్ పోస్టర్లు ప్రత్యక్ష్యం అయ్యాయి.

తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా రైతులు, చేనేత, కార్మిక వర్గం విలవిలాడుతోంది. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్, ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న పరిస్థితి ఇంకా ఉంది. ఆయా పార్టీలు స్వార్థం కోసం కలుషిత రాజకీయం చేస్తున్నారు.

ALSO READ : KTR : ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. ప్రశ్నిస్తే ఎకౌంట్ బ్లాక్.. సోషల్ మీడియాలో వైరల్..!

యువత మద్యం డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. బీఆర్ఎస్ ఇసుక మాఫియా, కబ్జాలు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఎదిరించిన వారిపై (యూఏపీఏ) చట్టం ప్రయోగిస్తూ మర్డర్‌లు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. ఆహ్వానించిన ఖర్గే మేధావులు, యువతను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

బీఆర్ఎస్ బడ నాయకుల అండదండలతో గ్రామ, మండల, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ప్రజలపై పెత్తనం చేలాయిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు చేలాయిస్తున్న పెత్తనాన్ని పీడిత ప్రజలంతా ఐక్యంగా ప్రతిఘటించాలి, ఎదుర్కోవాలని పిలుపునిస్తున్నాం.

ALSO READ : Rythu Bandhu : రైతుబంధు పై రాద్ధాంతం..!

బీఆర్ఎస్ నాయకులు కొనసాగిస్తున్న దోపిడీ విధానాలను దౌర్జన్యాలను ఆపకపోతే ప్రజల సమక్షంలో శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రజల వారసత్వ సహజ సంపద అయిన మైనింగ్‌ను వారి సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మేధావులు, యువత మైనింగ్‌ను రక్షించుకోవాలి.’ అంటూ పోస్టర్లు అతికించారు.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!

మరిన్ని వార్తలు