Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసిద్దిపేట జిల్లా

BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!

BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!

దుబ్బాక , మన సాక్షి :

బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి లో ఓ కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా దుండగుడు కత్తితో దాడి చేశాడు.

షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి ప్రభాకర్ రెడ్డి పొట్టలో కత్తితో దాడి చేశారు. దాంతో ప్రభాకర్ రెడ్డిని హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కత్తితో దాడి చేసే సమయంలో కార్యకర్తలు అలర్ట్ గా ఉండి దాడి చేసిన వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితక బాదారు.

ALSO READ : కాంగ్రెస్ లో అసమతి రాగం.. మునుగోడు టికెట్ ఆశించి బంగపడిన చల్లమల్ల సెల్ఫీ (వీడియో) వైరల్..!

అనంతరం పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తి చెప్యాలకు చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. అతడు యూట్యూబ్ ఛానల్ లో విలేకరిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. వెంటనే మంత్రి హరీష్ రావు ప్రభాకర్ రెడ్డిని ఫోన్ లో పరామర్శించారు. అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.

కాగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి ఎందుకు జరిగింది..? ఓ పథకం ప్రకారం జరిగిందా..? అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి పై దాడిని పలువురు తీవ్రంగా ఖండించారు.

ALSO READ : మాడుగులపల్లి : రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిన ట్రాక్టర్.. పల్నాడు ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

మరిన్ని వార్తలు