Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

BIG BREAKING : గొడ్డళ్లు, కత్తులతో సూర్యాపేట బిఎస్పి అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై దాడి

BIG BREAKING : గొడ్డళ్లు, కత్తులతో సూర్యాపేట బిఎస్పి అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై దాడి

తృటిలో తప్పిన ప్రమాదం

బి ఎస్ పి కార్యకర్తకు తీవ్ర గాయాలు

గట్టికల్ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం

సూర్యాపేట,  మనసాక్షి :

సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం గట్టికల్లు గ్రామంలో ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి (సుమారు ఏడు గంటల సమయంలో) బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ప్రచారానికి వెళ్ళారు. ప్రత్యర్థులు జానయ్య పై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు . దీంతో జానయ్య తృటిలో తప్పించుకోగా ఆయన అనుచరుడు కి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉదృత వాతావరణం ఏర్పడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తనపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని,
దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని వట్టే జానయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల పనితీరుకు గ్రామ ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు