Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంతెలంగాణరాజకీయం

BREAKING : ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ.. బిజీ, సీనియర్లకు ఆహ్వానం..!

BREAKING : ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ.. బిజీ, సీనియర్లకు ఆహ్వానం..!

ఢిల్లీ /మన సాక్షి :

తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో రెండు రోజులుగా బిజీ బిజీగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అంతేకాకుండా ఢిల్లీకి ఆయనకు మంగళవారం పిలుపు రావడంతో ఆయన వెళ్లారు.

అప్పటినుంచి రెండు రోజులుగా చాలా బిజీగా ఉన్నారు. తనను ముఖ్యమంత్రిగా నిర్ణయించినందుకుగాను అధిష్టానం కు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్య నేతలను ఆయన ఆహ్వానించారు.

ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!

సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ , ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఠాక్రే , కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తో పాటు పలువురు ముఖ్య నేతలను రేవంత్ రెడ్డి కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

ALSO READ : సీఎం గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు.. హై కమాండ్ స్పష్టం..!

కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి తనని ఆహ్వానించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు.

మరిన్ని వార్తలు