Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడ : శ్రీనివాస్ నగర్ లో చోరీ..!

మిర్యాలగూడ : శ్రీనివాస్ నగర్ లో చోరీ..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ లో తాళం వేసిన ఇంట్లో చోరీ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ నగర్ లోని చిలుకూరి వెంకటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌కు వారం రోజుల క్రితం వెళ్ళాడు.

కాగా ఆదివారం ఉదయం ఇంటి ఎదురుగా నివాసం ఉండేవాళ్ళు ఫోన్ చేసి డోర్ తీసి ఉన్నట్లు చెప్పడంతో వాళ్లు వచ్చి చూసుకున్నారు.  బెడ్ రూమ్ తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి బంగారం నగలను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు.

బీరువాలో ఉన్న రుద్రాక్ష హారం 40 గ్రాములు,  రెండు చైన్లు 35 గ్రాములు , నల్లపూసల గొలుసు 20 గ్రాములు, వెంకటేశ్వర ఉంగరం ఒకటి,  నవరత్న ఉంగరం ఒకటి చెవి కమ్మలు నాలుగు జతలు, లక్ష్మీదేవి ఉంగరం ఒకటి,  చెవిథితులు ఒకటి, ఆభరణాలు దోచుకున్నట్లుగా బాధితులు ఫిర్యాదు చేశారు.

బాగా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు