Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

BREAKING: రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెన్సేషనల్ కౌంటర్

BREAKING: రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెన్సేషనల్ కౌంటర్

మన సాక్షి, వెబ్ డెస్క్:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఇంద్రవెల్లి లో నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం విధితమే. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

క్రెడిట్ చోర్ కాంగ్రెస్ పార్టీకి ఇదే తొలిసారి కాదు చివరిసారి కూడా కాదు. కేసీఆర్ ప్రభుత్వంలోనే 6956 స్టాఫ్ నర్స్ పోస్టులు, 15,750 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు పోస్టులకు రిక్రూట్మెంట్ పూర్తయింది. ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలు వెలువడ లేదు. కాగా రిక్రూట్మెంట్ తో ఎలాంటి సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఫూల్స్ ను చేసేందుకు తామే నియామకాలు చేపట్టినట్లు చెబుతున్నారు. కొత్త ముఖ్యమంత్రి తన నోటితో అబద్ధాలు ఆడటం సిగ్గుచేటు.. అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.

ఈ ట్వీట్ కు 15,750 మంది పోలీస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లు గతంలో వచ్చిన వార్త స్క్రిప్ట్ ను జత చేశారు.

మరిన్ని వార్తలు