Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం
BREAKING : ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా.. వైఎస్ షర్మిలా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
BREAKING : ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా.. వైఎస్ షర్మిలా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
మన సాక్షి:
ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు పెంచాలంటూ ప్రభుత్వం అడగడంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఆమె చేసిన వ్యాఖ్యలు యధావిధిగా :
- ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే…
- ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ?
- మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ?
- 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలే.
- రాష్ట్రానికి రాజధాని లేదు.ప్రత్యేక హోదా రాలేదు.
- ప్రత్యేక ప్యాకేజీలు లేవు.పోలవరం పూర్తి కాలేదు.
- కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదు.
- కొత్త పరిశ్రమలు లేవు.ఉన్నవి ఉంటాయో లేదో తెలియదు.
- 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్పా…అభివృద్ధి చూపలేదు.
- మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదు.
- ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి.
- చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే…
- మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట.
- పూటకో మాట,రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను..
- కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం.
- ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా..
- వైసీపీ కి రాజధానిపై,రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదు.









