Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

BANDLA GANESH : కేటీఆర్ అమెరికా వెళ్ళింది అందుకే.. కేటీఆర్, రోజా పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..!

BANDLA GANESH : కేటీఆర్ అమెరికా వెళ్ళింది అందుకే.. కేటీఆర్, రోజా పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..!

హైదరాబాద్ ,మన సాక్షి :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై, ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రోజాపై కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహించి బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారని ప్రశ్నించారు.

మేడిగడ్డ కూలిపోతే మాదే బాధిత అని బీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. పనికి రానప్పుడు తీసేయడం తప్ప ఏం చేస్తారని ప్రశ్నించారు..? మేడిగడ్డను ఎలా నాశనం చేశారో..? చూసి వస్తారా.? అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. కేటీఆర్ లాగా రేవంత్ రెడ్డి తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి రాలేదని, రేవంత్ రెడ్డి ఫైటర్.. అని బండ్ల గణేష్ చెప్పారు.

ALSO READ : BRS : కాలేశ్వరం రాజకీయం.. మార్చి 1న చలో మేడిగడ్డ పిలుపునిచ్చిన కేటీఆర్..!

కేటీఆర్ అమెరికా వెళ్ళింది ఇల్లు కొనుక్కోవడానికే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డలో కుంగిపోయిన మూడు పిల్లర్లు.. 30 పిల్లలు కాకుండా కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రోజా.. ఆమె డైమండ్ రాని అని, జగన్ యాక్సిడెంట్ సీఎం అని పేర్కొన్నారు. తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారని.. పులుసు వండి పెట్టావు కాబట్టి పులుసురాని మాత్రమే కాకుండా రోజా ఐటమ్ రాని అని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరెన్నో బ్రేకింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి….

Manasakshi

మరిన్ని వార్తలు